అక్టోబర్ 2న రిలీజ్ కానున్న ‘సిగ్మా’

అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమాల్లో ‘సిగ్మా’ ఒకటి. లైకా ప్రొడక్షన్స్, ఏ. సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆసక్తికరమైన కాస్టింగ్‌తో పాటు ఇప్పటికే విడుదలైన తొలి రెండు పాటలు ‘సిగ్మా స్టైల్’, ‘అయ్యయ్యో అమ్మాడి’ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశాయి. రెండు పాటలు విభిన్నమైన మూడ్స్‌తో ఆకట్టుకోవడంతో ‘సిగ్మా’పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 2న ‘సిగ్మా’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

సినిమా కథ, మెయిన్ పాయింట్‌కి సంబంధించిన వివరాలను మేకర్స్ ఇంకా సీక్రెట్‌గానే ఉంచారు. అయితే ఇప్పటికే విడుదలైన రెండు పాటల విజువల్స్ ‘సిగ్మా’ ప్రపంచం ఎలా ఉండబోతుందనే దానిపై మంచి క్లూ ఇచ్చాయి.  ‘సిగ్మా స్టైల్’ లో కనిపించిన ఎనర్జీకి పూర్తి భిన్నంగా ‘అయ్యయ్యో అమ్మాడి’ మెలోడీతో ఆకట్టుకుంది. ఈ రెండు పాటలు సినిమాలోని విభిన్న షేడ్స్‌ను చూపించడంతో అసలు కథ ఏంటి? జేసన్ సంజయ్ ఎలాంటి ప్రపంచాన్ని క్రియేట్ చేశారనే ఆసక్తి పెరుగుతోంది.

ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిన తీరుపై లైకా ప్రొడక్షన్స్ కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ పూర్తవ్వడంతో పాటు, జేసన్ సంజయ్ ప్రొఫెషనలిజం, క్లారిటీ, ప్రతి విషయంలో ఆయన చూపించిన పర్ఫెక్షన్‌ను నిర్మాణ సంస్థ ప్రత్యేకంగా ప్రశంసించింది. డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ సినిమాను ఎంతో డిసిప్లిన్‌తో హ్యాండిల్ చేశారని పేర్కొంది.

లైకా ప్రొడక్షన్స్ హెడ్ జి.కె.ఎం. తమిళ్ కుమరన్ మాట్లాడుతూ.. “అక్టోబర్ 2న ‘సిగ్మా’ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్ అవుతుందని ప్రకటించడం ఆనందంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. పాటలకు వస్తున్న రెస్పాన్స్ సినిమాపై ఎగ్జైట్‌మెంట్‌ను మరింత పెంచింది. కథలోని మెయిన్ పాయింట్‌తో పాటు చాలా విషయాలను మేము కావాలనే సీక్రెట్‌గా ఉంచాం. ఇప్పటివరకు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా జేసన్ క్రియేట్ చేసిన వైబ్రెంట్, ఎంటర్‌టైనింగ్ వరల్డ్‌కు చిన్న గ్లింప్స్ మాత్రమే చూపించాం”  

‘సిగ్మా’ కోసం మేకర్స్ వినూత్నమైన ప్రమోషనల్, మార్కెటింగ్ క్యాంపెయిన్‌ను ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ప్రమోషన్స్ ప్రారంభం కానుండగా, టీజర్, ట్రైలర్, ఆడియో లాంచ్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను కూడా త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

లైకా ప్రొడక్షన్స్, ఏ. సుభాస్కరన్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, సంపత్ రాజ్, శివ పండిట్, అన్బు థాసన్, యోగ్ జపి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జేసన్ సంజయ్ కథ, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమన్ ఎస్. సంగీతం అందిస్తున్నారు. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, హరిహరసుధన్ వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్‌గా వ్యవహరిస్తున్నారు.

కథను ఇప్పటికీ సీక్రెట్‌గా ఉంచడంతో పాటు, రెండు పాటల ద్వారా విభిన్నమైన ప్రపంచాన్ని పరిచయం చేసిన ‘సిగ్మా’.. త్వరలో మొదలుకానున్న ప్రమోషన్స్‌తో మరింత బజ్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

Related Articles

Latest Articles