
లాస్య అండ్ మిధున క్రియేషన్స్ బ్యానర్‌పై చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్ కుమార్ నల్లూరి, స్రవంతి నంబూరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మోడ్రన్ మిస్మమ్మ’. సాయిబాబా కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. హర్ష నర్రా, తన్మయి ఖుషి, సిజు ఏఆర్, ప్రమోదిని, హారిక, డా.భద్రం, శివన్నారాయణ, రాకేష్ రాచకొండ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శేషు రాజ్ దడ్డాల, విజయ్ పిడపా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆదిత్య పాపిశెట్టి ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా, బాలకృష్ణ కొరియోగ్రఫీ చేస్తున్నారు. హరికృష్ణ జగురోతి స్క్రిప్ట్ డిపార్ట్మెంట్ను పర్యవేక్షిస్తున్నారు. సోమేష్ ఎరిపల్లి వీఎఫ్ఎక్స్ డైరెక్టర్‌గా, జి. పవన్ కళ్యాణ్ సౌండ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి ఉప్పుతొల్ల బాబు (బాబీ) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో గ్రాండ్‌గా విడుదల చేశారు. సంగీత దర్శకుడు గోపీ సుందర్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కిట్టు విస్సప్రగడ ఆకట్టుకునే సాహిత్యం అందించారు. ‘బెటర్ బీ ఏ మిస్సమ్మ’ అంటూ సాగిన పాటలో హీరో సంప్రదాయ పంచెకట్టులో కనిపిస్తుండగా, హీరోయిన్ తన్మయి ట్రెడిషనల్ డ్రెస్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. హీరోయిన్ పెళ్లి వద్దంటూ పాడుకునే ఈ పాట మహిళకు కనెక్ట్ చేసేలా ఉంటుంది.
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన ‘వదల’ చిత్ర నిర్మాత కిశోర్ నాయుడు మాట్లాడుతూ ..“ రీసెంట్గా ఈ సినిమా ప్రీమియర్ చూశా. సినిమా చూసేటప్పుడు నేను లోపాలు మాత్రమే వెతుకుతాను. కానీ ఇందులో ఏ ఒక్కటి దొరకలేదు. ఖచ్చితంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఇందులోని భద్రం పాత్ర చాలా హిలేరియస్‌గా ఉంటుంది’ అని అన్నారు.
హీరో హర్ష నర్రా మాట్లాడుతూ..“మిస్సింగ్, రోటి కపడా రొమాన్స్ తర్వాత ఇది నా మూడో సినిమా. ఆ రెండు చిత్రాలు కమర్షియల్‌గా పెద్దగా ఆడలేదు. అయినా నా పోరాటం ఆగదు. కష్టపడుతూనే ఉంటాను. ఈ సినిమా కష్టపడి కాకుండా ఇష్టపడి చేశాం. టీమ్ అంతా ఫ్రెండ్స్‌లా మూవీ చేశాం. తన్మయి చాలా బాగా నటించింది. ఈ పాట విషయంలో గోపీ సుందర్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. కిట్టు విస్సాప్రగడ గారు రాసిన లిరిక్స్ అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటాయి. అలాగే సినిమా కూడా అందరికీ రిలేట్ అవుతుంది” అని చెప్పారు.
హీరోయిన్ తన్మయి ఖుషి మాట్లాడుతూ ‘‘‘23’ మూవీ తర్వాత నటించిన సినిమా ఇది. నాగార్జున గారి మన్మధుడు చిత్రంలోని ‘వద్దురా సోదరా’ అనే సాంగ్ అప్పట్లో మగవాళ్లకు కనెక్ట్ అయినట్టు, ఇప్పుడు మా చిత్రంలోని ఈ సాంగ్ అమ్మాయిలకు కనెక్ట్ అవుతుంది. దర్శకుడు అమ్మాయిల పాయింట్స్ ఆఫ్ వ్యూలో ఈ కథను రాయడం చాలా సంతోషంగా ఉంది. నా క్యారెక్టర్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది” అని చెప్పారు.
డైరెక్టర్ సాయి బాబా మాట్లాడుతూ.. ‘‘ఈ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. ఇళ్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు.. అని పెద్దలు చెబుతుంటారు కదా.. దానికి నేనొక ఒకటి యాడ్ చేద్దామనుకుంటున్నా. సినిమా చేసి చూడు అని. ఈ మూడింటిలో అదే కష్టం ఉంటుంది అని నమ్ముతున్నా. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, నిర్మాత గారికి థ్యాంక్స్. ‘మిస్సమ్మ’ లాంటి క్లాసిస్ టైటిల్ పెట్టాలంటే కొంచెం ధైర్యం కావాలి. గతంలో వచ్చిన ఎన్టీఆర్ గారి ‘మిస్సమ్మ’, భూమిక గారి ‘మిస్సమ్మ’ ఈ రెండు చాలా అడ్వాన్స్ మూవీస్. మా సినిమాలో కూడా అలాంటి దమ్ము ఉందని నమ్మాం. నేను రాసినదానికంటే మా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్తో మోడ్రన్ మిస్సమ్మ అనే టైటిల్ పెట్టొచ్చు అని నిరూపించారు. గోపీ సుందర్ గారి మ్యూజిక్ సినిమాకు మరింత ప్లస్ అవుతుంది. ఈ సినిమా ద్వారా పెళ్లి వద్దు అని చెప్పడం లేదు.. పెళ్లి చేసుకోవాలంటే ఏం కావాలో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే” అని చెప్పారు.
నిర్మాత చిరంజీవి పమిడి మాట్లాడుతూ.. ‘‘మా బ్యానర్లో ‘కాలింగ్ సహస్ర’ తర్వాత వస్తోన్న రెండో చిత్రమిది. ఆ చిత్రానికి మేం ఊహించిన రిజల్ట్ రాలేదు. ఈ చిత్రానికి మాత్రం మంచి ఆదరణ దక్కుతుందని నమ్ముతున్నా. మా హీరో హర్ష చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. హీరోయిన్ కూడా అంతే బాగా నటించారు. రెండేళ్ల క్రితం ఈ జర్నీ స్టార్ట్ చేశాం. ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్టుగా మూవీ తీయాలనుకున్నాం. మంచి అవుట్‌పుట్ వచ్చింది. అనుకున్న టైమ్‌లో అనుకున్న బడ్జెట్‌తో సినిమా పూర్తి చేశాం. అదే మా మొదటి సక్సెస్‌గా భావిస్తున్నాం. ఈ సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్”అని అన్నారు.
డివోపీ శేషు మాట్లాడుతూ.. తన లైఫ్‌లో ఇదొక ఇంపార్టెంట్ చాప్టర్ అని, టీమ్ అందరి హార్డ్ వర్క్‌తో మంచి అవుట్‌పుట్ వచ్చింది అని అన్నారు. ఈ మూవీ టైటిల్ సాంగ్ కంపోజ్ చేయడం చాలా ఆనందంగా ఉందని కొరియోగ్రాఫర్ బాలకృష్ణ అన్నారు.
సినిమా పేరు : మోడ్రన్ మిస్సమ్మ
బ్యానర్ : లాస్య అండ్ మిధున క్రియేషన్స్
నటీనటులు : హర్ష నర్రా, తన్మయి ఖుషి, సిజు ఏఆర్, ప్రమోదిని, హారిక, డా.భద్రం, శివన్నారాయణ, రాకేష్ రాచకొండ తదితరులు..
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : సాయి బాబా
నిర్మాతలు : చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్ కుమార్ నల్లూరి, స్రవంతి నంబూరి
సినిమాటోగ్రాఫర్ : శేషు రాజ్ దడ్డాల, విజయ్ పిడప
సంగీతం : గోపీ సుందర్
ఎడిటర్ : ఆదిత్య పాపిశెట్టి
కొరియోగ్రఫీ : బాలకృష్ణ
స్క్రిప్ట్ డిపార్ట్మెంట్ : హరికృష్ణ జగురోతి
గీత రచయిత : కిట్టు విస్సాప్రగడ
వీఎఫ్ఎక్స్ డైరెక్టర్ : సోమేష్ ఎరిపల్లి
సౌండ్ డిజైన్ : జి. పవన్ కళ్యాణ్
కలరిస్ట్ : నితీష్ మిశ్ర
మేకప్ చీఫ్ : పున్నం రాజు
కో -డైరెక్టర్ : అపేంద్ర
అసోసియేట్ డైరెక్టర్ : హరికృష్ణ జగురోతి
అసిస్టెంట్ డైరెక్టర్స్ : వినయ్ తోపురి, శివ నాగ సాయి, గౌరవ్
అసోసియేట్ ఎడిటర్స్ : రాము, శివ సుందరనీది
పోస్ట్ ప్రొడక్షన్ : అరేటే ప్రొడక్షన్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఉప్పుతొల్ల బాబు (బాబీ)
పబ్లిసిటీ డిజైన్స్ : దివా పెద్దవీటి
స్టిల్స్ : స్వయంకృష్ణి కెమెరా రెంటల్స్
పీఆర్వో : హర్ష


