
సూర్య, మమిత బైజు జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగావంశీ సాయి సౌజన్య నిర్మాతలుగా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం విశ్వనాథ్ & సన్స్. జీవి ప్రకాష్ సంగీతం అందించిన చిత్రానికి నిమిష్ రవి సినిమాటోగ్రఫీ చేయగా నవీన్ నూలి ఎడిటింగ్ చేశారు. రవీనా టాండన్, రాధిక శరత్ కుమార్, హైపర్ ఆది, నాజర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ :
ఒలింపిక్స్ షూటింగ్ లో బంగారు పతకం గెలిచిన ఒక గొప్పింటి వ్యక్తి సంజయ్ విశ్వనాథ్ (సూర్య). అయితే అతనికి పెళ్లి చేసుకోవడం పై పెద్దగా అభిప్రాయం లేకపోవడంతో అతని తల్లి(రాధిక శరత్ కుమార్) తన వంశానికి వారసుడు కావాలి అని అడగడంతో అతను పెళ్లి చేసుకోకుండా సరోగసి ద్వారా మ్యాడీ అనే ఒక అమ్మాయి (మమిత బైజు) సాయంతో ఒక బిడ్డను కొంటారు. కానీ అతనికి ఉన్న ఆరోగ్య సమస్య వల్ల తర్వాత ఆమె తన జీవితంలోకి మరలా వస్తుంది. అయితే ఆ బాబుకు వచ్చిన ఆరోగ్య సమస్య ఎటువంటిది? ఆ బాబు సరోగసి తల్లి ఇష్టం తోనే వస్తుందా లేదా ఏవైనా షరతులు ఉంటాయా? విషయం తెలిసిన తన తల్లి రియాక్షన్ ఏంటి? చివరికి ఆ సమస్య తీరుతుందా లేదా? చివరివరకు తన సరోగసి తల్లి తనతో ఉంటుందా లేదా? రవీనా టాండన్ కు, ఈ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి? అని అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
నటీనటుల నటన :
సూర్య ఈ చిత్రంలో ఒక ధనవంతుడైన వ్యక్తిగా చాలా సహజ సిద్ధమైన నటన చూపించారు. ప్రతి సీన్ ఇంకా ఎమోషన్స్ లో చాలా సెటిల్ గా పెర్ఫామ్ చేసి సినిమా అంతట చాలా అద్భుతంగా నటించారు. మమత బైజు ఒక అల్లరి అమ్మాయిలాగా తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. అలాగే ఎమోషన్స్ కూడా చాలా బాగా పండేలా నటించారు. రాధిక శరత్ కుమార్ సినిమా అంతట అటు ఎమోషన్ గా అలాగే ఇటు కాస్త ఫన్ క్యారీ చేస్తూ చాలా బాగా నటించారు. రవీనా టాండన్ సహజ సిద్ధమైన పర్ఫామెన్స్ తో చాలా న్యాచురల్ గా పెర్ఫార్మ్ చేసి ముఖ్యంగా ఎమోషన్స్ బాగా క్యారీ చేశారు. అలాగే చిత్రంలో ఉన్న నటీనటులు అందరూ తమ తమ పాత్రలకు తగ్గట్లు నటిస్తూ సినిమాకు అంతులేని బలాన్ని అందించారు.
సాంకేతిక విశ్లేషణ :
సరికొత్త కథలను ఫ్యామిలీ ఆడియోస్ కు దగ్గర చేస్తూ తీసే సినిమా వెంకీ అట్లూరి నుండి మరోసారి వచ్చింది. కుటుంబ విలువలతో అలాగే ప్రస్తుత సమాజంలోని కొన్ని విషయాలను తెలియజేస్తూ ఒక అద్భుతమైన కథను ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు వెండి తెరపై చూపించడంలో వెంకీ అట్లూరి విజయం సాధించారు. అలాగే సినిమాలోని లొకేషన్స్ చాలా బాగున్నవి. రిచ్ వాల్యూస్ యాడ్ చేస్తూ అద్భుతమైన బ్యాగ్రౌండ్స్ అలాగే లొకేషన్స్ చూపించడంలో డిఓపి విజయం సాధించారు. పాటలు అలాగే మరి ముఖ్యంగా ఎమోషన్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ సంగీతం అందించడంలో జీవి ప్రకాష్ మరోసారి గెలిచారు. కలరింగ్, విఎఫ్ఎక్స్ వంటి ఇతర సాంకేతిక విషయాలు చాలా బాగున్నాయి. కామెడీ చాలా బాగుంది. నిర్మాణ విలువ అద్భుతంగా ఉన్నాయి.
సారాంశం :
కుటుంబ విలువలతో కూడిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అంతా కుటుంబంతో కలిసి ఆదరించే విధంగా చూసేలా ఉంటుంది.


