‘మకుటం’ చిత్ర రివ్యూ

విశాల్, దుషార విజయన్ జంటగా విశాల్ స్వీయ దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై బి. సురేష్, ఆర్.బి. జీవన్ చౌదరి, జితన్ రమేష్, జీవా నిర్మాతలుగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మకుటం. అంజలి, జాన్ విజయ్, జయ ప్రకాష్, అజయ్, వంశీ కృష్ణ, అబూ సలీం, అర్జయ్, ఝాన్సీ, పదం కుమార్, సభుమోన్ తదితరులు కీలక పాత్ర పోషించిన చిత్రానికి రిచర్డ్ ఎం. నాథన్ & అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ చేయగా జీవి ప్రకాష్ సంగీతాన్ని అందించారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంతో కష్టపడుతూ జీవించే వ్యక్తి విశాల్. కేవలం ఒక కారు కొనడం అనేది తనకు చాలా పెద్ద కళగా ఉంటుంది. అయితే పెట్టకేలకు ఒక కారు కొనుక్కుని చాలా సంతోషంగా ఉంటాడు. ఇదే సమయంలో మరొక నగరంలో ఆధిపత్య పోరు నడుస్తుంటుంది. ఆ పోరుకు, విశాల్ కు సంబంధం ఏంటి? దానివల్ల ఇతని కుటుంబం ఏమైనా సమస్యల్లో పడుతుందా? అసలు ఎవరి కథలోకి ఎవరు వస్తారు? చివరికి ఆ సమస్యల నుండి ఇతని కుటుంబం బయట పడుతుందా లేదా? అనే అనేక సమస్యలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటుల నటన :
విశాల్ ఈ చిత్రంలో రెండు పాత్రలలో కనిపిస్తారు. మొదటి పాత్ర ఒక యువకుడి పాత్ర. మధ్యతరగతి కుటుంబంలో ఉండే సమస్యలతో ఉండే వ్యక్తిలా చాలా న్యాచురల్ గా పెర్ఫార్మ్ చేశారు. మరొక పాత్ర కాస్త రగ్గుడుగా కనిపిస్తూ ఆసక్తికరంగా ఉంటుంది. దుషార విజయన్ కూడా మధ్యతరగతి హౌస్ వైఫ్ క్యారెక్టర్ లో చాలా బాగా నటించారు. కుటుంబ సమస్యలను చూస్తూ, వాటిని మేనేజ్ చేసుకుంటూ ఉండే క్యారెక్టర్ లో చాలా బాగా నటించారు. అలాగే అంజలి పాత్ర చాలా సహజసిద్ధంగా ఉంటుంది. అజయ్, జాన్ విజయ్, జయప్రకాష్ పాత్రలు పరిమితమైనప్పటికీ మంచి పర్ఫామెన్స్ అందించారు. అలాగే చిత్రంలో నడిపించిన ఇతర నటీనటులు అందరూ తమ తమ పాత్రల పరిధిలో నటిస్తూ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు.

సాంకేతిక విశ్లేషణ :
తన చిత్రాన్ని తనే స్వయంగా దర్శకత్వం చేసుకోవడంలో విశాల్ అంతగా విజయం సాధించినట్లు అనిపించలేదు. స్క్రీన్ ప్లే చాలా స్లో గా ఉంది. కథ కాస్త మలుపులు తిరిగినప్పటికీ దానిని హ్యాండిల్ చేయలేకపోయినట్లు అర్థమవుతుంది. సినిమా నిదానంగా ఉండటం తో పాటు ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాలేకపోయారని అర్థమవుతుంది. ఎంత నటించిన కథ కూడా చాలా ముఖ్యమే. సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ అలాగే బ్యాక్ గ్రౌండ్ లాంటి ఇతర సాంకేతిక విషయాలు బలంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
నటీనటుల నటన, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, లొకేషన్స్.

మైనస్ పాయింట్స్ :
కథ, స్క్రీన్ ప్లే.

సారాంశం :
మకటం చిత్రం ఒక రేంజ్ ఆడియన్స్ వరకు సాటిస్ఫై చేసే అవకాశాలు ఉన్నాయి.

Related Articles

Latest Articles