
పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’ ఈ సినిమాకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బత్తుల పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను మే 22న రిలీజ్ చేయగా మంచి విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ ఆడియెన్స్, మహిళా ప్రేక్షకుల ఆదరణ లభించడంతో ఈ చిత్రానికి ఘన విజయం దక్కింది.
కావాల్సినంత కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తీసిన ‘పురుష:’ సినిమాతో బత్తుల పవన్ కళ్యాణ్ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకున్నారు. కసిరెడ్డి రాజ్ కుమార్, సప్తగిరి, వెన్నెల కిషోర్ పాత్రలు ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయన్న సంగతి తెలిసిందే. రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ల పాత్రలు సైతం ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాయి. ముగ్గురు హీరోయిన్లకి కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ చిత్రం థియేటర్లో మంచి స్పందన దక్కించుకున్న తర్వాత రీసెంట్‌గానే ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చాయి.
స్ట్రీమింగ్ అయిన కొన్ని రోజులకే ‘పురుష:’ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అలా అన్ని చోట్లా ఈ మూవీకి మంచి ఆదరణ దక్కుతోంది. ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసేలా ఉండటంతో ఓటీటీలోనూ ఈ సినిమాకి విశేషణమైన ఆదరణ లభిస్తోంది.


