
నందమూరి బాలకృష్ణ రాజమండ్రిలో జరుగుతున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో ఎడమ మోకాలికి గాయమైంది. వెంటనే స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం ఆయనను ఎయిర్‌లిఫ్ట్ ద్వారా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.
వైద్యుల ప్రాథమిక పరీక్షల్లో ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలాల్లో రక్తం గడ్డకట్టడం, వాపు కనిపించిందని, ఇది మజిల్ టియర్‌కు సంబంధించిన గాయంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆర్థోపెడిక్ నిపుణుల పర్యవేక్షణలో వివిధ వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి.
బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, అన్ని పరీక్షల అనంతరం తుది చికిత్స ప్రణాళికను నిర్ణయిస్తామని ఏఐజీ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్‌లో వెల్లడించారు.


