‘MRP – నీకెంత నాకెంత’ చిత్ర రివ్యూ

శ్రవణ్ జేష్ఠ నిర్మాణ దర్శకత్వంలో నరేష్ అగస్త్య, డోనల్ బిష్ట్ జంటగా వెన్నెల కిషోర్, సుదర్శన్, కసిరెడ్డి రాజ్ కుమార్, హర్షవర్ధన్, చైతన్య జొన్నలగడ్డ, గగన్ విహారి, పృథ్వీరాజ్ తదితరులు కీలకపాత్రను పోషించిన చిత్రం MRP. అజయ్ అరసాడ సంగీతం అందించిన ఈ చిత్రానికి రాకేష్ కొలాంచి సినిమాటోగ్రఫీ చేయగా మార్తాండ కే వెంకటేష్ ఎడిటింగ్ చేశారు. నేడు విడుదలైన ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం చేయడం ఇష్టం లేక సొంత వ్యాపారం చేసుకునే ఆలోచనతో ఉన్న ముగ్గురు యువకులు ఒక వ్యక్తి దగ్గర అప్పుచేసి వ్యాపారం మొదలుపెడతారు. అనుకోకుండా ఆ వ్యాపారం ఒక ప్రమాదంలో నాశనం అవుతుంది. ఆ తరువాత వాడు చేసిన అప్పు అలాగే వడ్డీ తిరిగి కట్టేయాలని తొందరలో ఒక చనిపోయిన వ్యక్తి బాడీ ద్వారా సంపాదించాలనుకుంటారు. అసలు వారు అప్పు చేసింది ఎవరి దగ్గర? ఆ చనిపోయిన వ్యక్తికి, అప్పు ఇచ్చిన వ్యక్తికి సంబంధం ఏంటి? వారు చేసిన వ్యాపారం ఏంటి, ఆ వ్యాపారం ఎలా నాశనం అవుతుంది? ఈ ప్రయాణంలో ఉండే మలుపు ఎటువంటివి? అనే అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపి ఈ సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన :
నరేష్ అగస్త్య, సుదర్శన్, కసిరెడ్డి రాజ్ కుమార్ ముగ్గురు ఫ్రెండ్స్ గా అద్భుతమైన నటన ప్రదర్శించారు. అటు కామెడీ నుండి ఇటు ఎమోషన్స్ వరకు ప్రతి విషయంలోనూ తమదైన బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. హీరోయిన్ పాత్ర పరిమితంగానే ఉంది. వెన్నెల కిషోర్, హర్షవర్ధన్ సినిమా అంతటా కనిపిస్తూ మంచి వినోదాన్ని అందించారు. చైతన్య జొన్నలగడ్డ, గగన్ విహారి, పృథ్వీరాజ్ పాత్రలు పరిమితమైనప్పటికీ వారు తెరపై కనిపించిన కొంత సమయం బాగా నటించారు. అలాగా చిత్రంలో నటించిన ఇతర నటీనటులు తమ తమ పాత్రల పరిధిలో నటిస్తూ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు.

సాంకేతిక విశ్లేషణ :
ఒక నూతన కథను తీసుకుని తెరపై ప్రత్యేకకు అర్థమయ్యేలా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు కానీ ఇంకా కాస్త జాగ్రత్త పడి ఉంటే మరింత అద్భుతంగా ఉండేది అనిపించింది. స్క్రీన్ ప్లే బాగున్నప్పటికీ సినిమా మంచి ఫ్లోలో ఉన్నప్పుడు పాటలు కాస్త ఫ్లో మిస్ చేశాయి అనిపించింది. ఆర్ఆర్ విషయంలో మరింత జాగ్రత్త పడితే బాగుండేది. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. లొకేషన్స్, కలరింగ్ ఇంకా ఇతర సాంకేతిక విషయాలు చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ చాలా అద్భుతంగా వచ్చాయి.

ప్లస్ పాయింట్స్ :
కథ, నటీనటుల నటన, స్క్రీన్ ప్లే.

మైనస్ పాయింట్స్ :
ఆర్ఆర్, పాటలు.

సారాంశం :
ఒక మంచి మలుపులు తిరిగే మోస్ట్ ఎంటర్టైనింగ్ సినిమాగా MRP ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంటుంది.

Related Articles

Latest Articles