
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఈ ఉదయం ముంబైలో సర్జరీ జరిగింది. రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉండటంతో ఇటీవల డాక్టర్లు ఆపరేషన్ అవసరమని సూచించారు. రెండు భుజాలకు ఒకేసారి శస్త్ర చికిత్స చేస్తే నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో ఇవాళ కుడి భుజానికి 3 గంటల పాటు సర్జరీ చేశారు. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో ఆపరేషన్ చేయాల్సి ఉంటుందన్నారు.


