
ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ హీరోగా, తెలుగమ్మాయి నాగదుర్గ హీరోయిన్‌గా నటించిన తమిళ చిత్రం ‘లవ్ ఓ లవ్’ తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చింది. మగేష్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సెల్వరాఘవన్, కేఎస్ రవికుమార్, వనిత విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు.
కథ:
రఘు (పవిష్ నారాయణ్) ప్రేమించిన అమ్మాయి అవంతిక (నాగదుర్గ) కోసం తన డబ్బు, సమయం అన్నీ ఖర్చు చేస్తూ అప్పుల్లో కూరుకుపోతాడు. కొన్ని అనుకోని సంఘటనలతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఆ తర్వాత ప్రేమలో అబ్బాయిలు పడే కష్టాలు అవంతిక స్వయంగా అనుభవించాలని రఘు ఒక షరతు పెడతాడు. ఆ షరతును అవంతిక అంగీకరించిన తర్వాత ఏమైంది? ఆమెకు రఘు బాధలు అర్థమయ్యాయా? చివరికి వీరి ప్రేమ ఏ మలుపు తిరిగింది? అనేదే మిగతా కథ.
నటీనటుల నటన:
పవిష్ నారాయణ్ ప్రేమలో ఇబ్బందులు పడే యువకుడిగా మంచి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా మెప్పించాడు. నాగదుర్గ తన తొలి తమిళ చిత్రంలో చలాకీగా నటించి, కామెడీతో పాటు భావోద్వేగ సన్నివేశాల్లో కూడా మంచి నటన కనబరిచింది. సెల్వరాఘవన్, వనిత విజయ్ కుమార్, కేఎస్ రవికుమార్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం:
సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. పాటలు పెద్దగా గుర్తుండవు. తెలుగు డబ్బింగ్ కొన్ని చోట్ల సహజంగా అనిపించదు. దర్శకుడు ప్రేమలో అబ్బాయిలు ఎదుర్కొనే పరిస్థితులను వినోదాత్మకంగా చూపిస్తూ, చివర్లో ఎమోషన్‌ను జోడించే ప్రయత్నం చేశాడు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
చిత్ర విశ్లేషణ:
సినిమా మొదటి నుంచి చివరి వరకు మంచి కామెడీతో సాగుతుంది. ముఖ్యంగా ప్రేమలో అబ్బాయిలు ఎదుర్కొనే సరదా, ఇబ్బందులను రియల్ లైఫ్‌కు దగ్గరగా చూపించడం నవ్వులు పంచుతుంది. ఫస్ట్ హాఫ్ ఎక్కువగా ఎంటర్‌టైన్ చేస్తే, సెకండ్ హాఫ్‌లో కూడా కామెడీ కొనసాగుతుంది. అయితే క్లైమాక్స్‌ను పూర్తిగా ఎమోషనల్ వైపు మళ్లించడం వల్ల మొదట వచ్చిన ఫన్ ఫీల్ కొంత తగ్గినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్‌గా సినిమా ఆకట్టుకుంటుంది.
ప్లస్ పాయింట్స్ :
కథ, దర్శకత్వం, నటీనటుల నటన, కామెడీ
మైనస్ పాయింట్స్ :
బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కొంత ఎమోషన్
సారాంశం:
‘లవ్ ఓ లవ్’ ప్రేమలో అబ్బాయిలు పడే కష్టాలను కామెడీగా చూపిస్తూ, చివర్లో ఎమోషనల్ టచ్ ఇచ్చిన వినోదాత్మక చిత్రం. నవ్వుకోవాలనుకునే వారికి ఈ సినిమా ఒక మంచి టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్.


