
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో రూపొందుతున్న #ChiruBobby2 / #Chiru158 సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రస్తుతం రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు.
ఈ యాక్షన్ ఎపిసోడ్‌లో చిరంజీవి పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించనుండగా, స్వయంగా రిస్కీ స్టంట్స్ కూడా చేస్తున్నారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా టైటిల్ టీజర్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్, ఆంటోనీ రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇందులో చిరంజీవితో పాటు అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది.


