“టాక్సిక్” ‘లేడీస్ & లేడీస్’ వీడియో విడుదల

యష్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమా నుంచి ‘లేడీస్ & లేడీస్’ పేరుతో కొత్త వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి తమ పవర్‌ఫుల్ పాత్రలతో ఆకట్టుకున్నారు.

స్టైలిష్ విజువల్స్, యాక్షన్, మిస్టరీతో నిండిన ఈ వీడియో సినిమాలో మహిళా పాత్రల ప్రాధాన్యాన్ని చూపిస్తుంది. అలాగే యష్ మరోసారి హై-వోల్టేజ్ యాక్షన్ అవతార్‌లో కనిపించనున్నారు.

కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో తెరకెక్కుతుండగా, తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో కూడా విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా 2026 ఆగస్టు 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

Latest Articles