అంగరంగ వైభవంగా “రావు బహదూర్” మోర్ దాన్ ఏ టీజర్ లాంచ్ ఈవెంట్

సూపర్ స్టార్ మహేష్ బాబు పవర్ ఫుల్ వాయిస్ తో సత్యదేవ్,  వెంకటేష్ మహా, ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ మోస్ట్ అవైటెడ్ సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’ మోర్ దాన్ ఏ టీజర్” రిలీజ్

టాలెంటెడ్ హీరో సత్యదేవ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకటేష్ మహా కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, వినూత్న ప్రచార కార్యక్రమాలు, పలువురు ప్రముఖుల ప్రశంసలతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై, ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా మేకర్స్ “మోర్ దాన్ ఏ టీజర్” పేరుతో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోకు మహేష్ బాబు అందించిన పవర్‌ఫుల్ వాయిస్‌ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భావోద్వేగాలతో కూడిన ఈ నేరేషన్, రావు బహదూర్ కేవలం ఒక సినిమా కాదు… సరికొత్త సినీ అనుభూతి అనే విషయాన్ని తెలియజేస్తోంది.

“When drama begins, logic ends” అనే పాపులర్ కోట్ తో ప్రారంభమైన ఈ నేరేషన్‌కు మహేష్ బాబు కొత్త అర్థాన్ని జోడించారు. “డ్రామాతో పాటు మ్యాజిక్ కలిస్తే… లాజిక్‌కు కొత్త అర్థం పుడుతుంది” అంటూ చెప్పిన డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఒక చిన్న సందేహం ఎంతటి శక్తివంతంగా మారి విధినే మార్చగలదో, అసలు ఉండకూడని ఒక మనిషి జీవితాన్ని ఎలా నిలబెడుతుందో, ఆ సందేహం క్రమంగా అతని జీవితమంతా ఆక్రమించి ప్రపంచాన్నే తలకిందులు చేసే స్థాయికి ఎలా చేరుకుంటుందో నేరేషన్‌లో ఆసక్తికరంగా చూపించారు. కథను ఎక్కడా బయటపెట్టకుండా క్యూరియాసిటీని మరింత పెంచేలా ఈ వీడియోను తీర్చిదిద్దారు.

 ‘‘ఇక్కడ మేజిక్‌ అంటే గారడి కాదు.. దృశ్య కావ్యం” అని మహేష్ బాబు చెప్పడం విశేషం. అద్భుతమైన విజువల్స్, భావోద్వేగాలతో కూడిన కథనంతో ఈ చిత్రం సరికొత్త సినీ అనుభూతిని అందించబోతోందని ఈ వీడియో స్పష్టం చేస్తోంది.

చివరగా “మునుపెన్నడూ చూడని విధంగా తెలుగు సినిమా.. రావు బహదూర్ ” అని మహేష్ బాబు ఇచ్చిన హామీతో రావు బహదూర్ అంచనాలు మరింతగా పెరిగాయి.

Related Articles

Latest Articles