
కామెడీ హీరో అల్లరి నరేష్ తన 65వ చిత్రంగా దర్శకుడు చంద్ర మోహన్ చింతాడతో కలిసి ‘రంభ ఊర్వశి మేనక’ అనే ఫాంటసీ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. స్వర్గంలోని మెట్లపై రంభ, ఊర్వశి, మేనక పేర్లు ఉన్న గ్రంథాన్ని చేతిలో పట్టుకుని అల్లరి నరేష్ కనిపిస్తున్న ఈ పోస్టర్ ఆసక్తిని పెంచుతోంది. ఫాంటసీ, కామెడీ కలగలిపిన వినోదభరిత చిత్రంగా ఇది తెరకెక్కుతోంది.
ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, నరేష్ వీకే, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.


