అమరావతిలో నిర్మించనున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి రూ. లక్ష విరాళం అందజేసిన కర్నూలు ఎన్‌బీకే ఫ్యాన్స్ అధ్యక్షుడు సుధాకర్ నాయుడు

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించనున్న నూతన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి కర్నూలు ఎన్‌బీకే ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు బి. సుధాకర్ నాయుడు రూ.1 లక్ష విరాళాన్ని చెక్ రూపంలో అందజేశారు. హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారిని స్వయంగా కలిసి విరాళం అందించారు.

ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతూ, అభిమానులు సేవా కార్యక్రమాల్లో ముందుండటం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఎన్‌బీకే ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. అమరావతిలో నిర్మించనున్న ఈ నూతన క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అభిమాన సంఘ ప్రతినిధులు, ఆసుపత్రి నిర్వాహకులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles