
1996లో తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో జన్మభూమి కాలనీ పేరిట పేదలకు ఇళ్ళు కట్టించడంతోపాటు, పలు అభివద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. తరువాత మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో కేసీఆర్ ఆహ్వానం మేరకు 2010లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. కూకట్‌పల్లి నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్ గా పనిచేసి, పార్టీ బలోపేతానికి కృషిచేశారు. 2014లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి, తెలుగుదేశం అభ్యర్థి మాధవరం కృష్ణారావు చేతిలో ఓడిపోయారు.
గొట్టిముక్కల పద్మారావు, తెలంగాణ ఉద్యమకారులు, సినీ నిర్మాత కూడా. పద్మప్రియ ఆర్ట్స్ బ్యానర్ అనే నిర్మాణ సంస్థ ద్వారా సుమన్ తో కంచు కవచం, రాజేంద్రప్రసాద్తో జోకర్, ఏప్రిల్ 1 విడుదల వంటి సినిమాలను నిర్మించారు.


