“వంద దేవుళ్ళు” చిత్ర రివ్యూ

విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఫాతిమా విజయ్ ఆంటోని సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి నిర్మాతగా శశి దర్శకత్వంలో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వంద దేవుళ్ళు. విజయ్ ఆంటోని, శ్వాసిక, అజయ్, లిజోమోల్ జోష్, కావ్య తదితరులు కీలకపాత్రలో పోషించిన ఈ చిత్రానికి బాలాజీ శ్రీరామ్ సంగీతం అందించగా దర్శన్ సినిమాటోగ్రఫీ చేశారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
ఒక చిన్న పల్లెటూరిలో చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన ఒక ఆవిడ ఇద్దరు పిల్లలతో ఎంతో కష్టపడి తన జీవనాన్ని సాగిస్తారు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వారికి పెళ్లి చేద్దామనుకునే సమయంలో ఆమె పిల్లలు ఆమెకు పెళ్లి చేయాలనుకుంటారు. ఇది ఇలా ఉండగా తనను ఈ వయసులో ఎవడు పెళ్లి చేసుకోరని అనుకుని సరే అంటారు. కానీ ఆ గ్రామ పట్టింపుల వల్ల ఆమెకు పెళ్లి చేసేందుకు ఆ గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు ఒప్పుకోరు. చివరికి ఆమెకు పెళ్లి అవుతుందా లేదా? ఆమె పిల్లలకు పెళ్లి అవుతుందా లేదా? ఆ గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు ఆ పెళ్లిను ఆపేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు? ఈ ప్రయత్నాలలో వచ్చే మలుపులు ఏంటి? ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చిన వ్యక్తి ఎవరు? అతను వచ్చిన తర్వాత ఈ కథలో జరిగే మార్పులు ఏంటి? యదార్థ సంఘటనలు బట్టి తీసిన ఈ కథ చివరికి ఎటు వెళ్తుంది? అని అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటుల నటన :
ఈ చిత్రంలో మొదటినుండి మనకు కనిపించే వ్యక్తి శ్వాసిక. ఒక పల్లెటూరి మిడిల్ ఏజ్ అమ్మాయిగా ఆమె చేసిన పర్ఫామెన్స్ సినిమా అంతటా ఒక నిజమైన పాత్రలాగా అనిపిస్తుంది. ఆమె పిల్లలుగా నటించిన ఇద్దరు యువకులు అద్భుతంగా నటించారు. ముఖ్యంగా పెద్ద కొడుకు పాత్ర పోషించిన అజయ్ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అతని కెరియర్లో ఈ పాత్ర ఒక మార్కుగా మిగిలిపోతుంది. అలాగే విజయ్ ఎండని పాత్ర ఈ సినిమాలో చాలా సాధారణంగా ఉండటం విశేషం. చిత్రంలో నటించిన ఇతర నటీనటులు అందరూ తమ తమ పాత్రలో పరిధిలో నటిస్తూ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు.

సాంకేతిక విశ్లేషణ :
యదార్థ సంఘటనను తీసుకొని సామాజిక విలువలతో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా లాగా చిత్రీకరించడం ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా అంటే ఒక ఛాలెంజ్ అని చెప్పుకోవాలి. ఈ కథను దర్శకత్వం చేయడంలో దర్శకుడు శశి విజయం సాధించారు. సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరొక భలాన్ని చేకూర్చింది. అదేవిధంగా సినిమాటోగ్రఫీ ఒక మారుమూల పల్లెటూరిలో ప్రతి లొకేషన్ వాడుకుంటూ చాలా బాగా అనిపించింది. పాటలు బాగున్నాయి. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ కలరింగ్ ఇంకా ఇతర సాంకేతిక విషయాలు సింపుల్ గా అనిపించాయి.

ప్లస్ పాయింట్స్ :
కథ, దర్శకత్వం, బిజిఎం, నటీనటుల నటన.

మైనస్ పాయింట్స్ :
కొన్ని సన్నివేశాలు స్లోగా ఉండటం.

సారాంశం :
సమాజంలో ఉన్న పరిస్థితులను చూపిస్తూ ఒక మెసేజ్ తో కుటుంబ ప్రేక్షకులను అందరిని ఎంటర్టైన్ చేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న చిత్రం వంద దేవుళ్ళు.

Related Articles

Latest Articles