“ఐ యామ్ హ్యాండ్సమ్” చిత్ర రివ్యూ

కే ఫిలిమ్స్ బ్యానర్ పై మహేష్ గుడారు సమర్పణలో కేదార్నాథ్ నిర్మాతగా దుర్గా దేవ్ నాయుడు రచన దర్శకత్వంలో నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం ఐ యామ్ హ్యాండ్సమ్. దుర్గా దేవ్ నాయుడు స్వయంగా హీరో పాత్రలో నటించిన ఈ చిత్రంలో అన్విష హీరోయిన్ పాత్ర పోషించగా కిట్టయ్య, రూపకళ, ఫణింద్ర, అశోక్, కీర్తి, వర్ణిక, సిరి జూపల్లి, కేదార్ శంకర్ తదితరులు కీలకపాత్రను పోషించారు. ఎన్ఎస్ ప్రసూ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి శివ మంచాల ఎడిటింగ్, ఎస్ నాగార్జున రాయల్ సినిమాటోగ్రఫీ చేశారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
2009 కాలంలో ఒక చిన్న గ్రామంలో జరిగే కథ ఇది. ఆ గ్రామానికి దగ్గరలోని టౌన్ లో డాక్టర్ గా ఉన్న ఒక అమ్మాయి తన బృందంతో కలిసి మెడికల్ క్యాంపు వెళ్తారు. అదే గ్రామంలో డిగ్రీ చదువుకున్న ఒక చిన్న కుటుంబంలోని యువకుడు తన మంచితనంతో స్నేహితులతో, తల్లిదండ్రులతో కలిసి చాలా ఆనందంగా ఉంటాడు. మెడికల్ క్యాంపుకు వెళ్లిన వారంతా ఊరి సర్పంచి ఇంట్లో బస చేస్తారు. ఇది ఇలా ఉండగా ఆ గ్రామంలోని యువకుడు ఆ యువ డాక్టర్ను చూసి ప్రేమలో పడతాడు. చివరికి ఆ అమ్మాయి అతడిని ప్రేమిస్తుందా లేదా? వారికి వివాహం జరుగుతుందా లేదా? తల్లిదండ్రులు ఆ యువకునికి సపోర్ట్ ఇస్తారా లేక వ్యతిరేకిస్తారా? చివరికి కథ ఎక్కడ మలుపు తిరుగుతుంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటుడు నటన :
తానే దర్శకత్వం చేస్తూ నటించిన తొలి చిత్రం అయినప్పటికీ దుర్గా దేవ్ నాయుడు ఈ చిత్రంలో ఎక్కడ కూడా మొదటి చిత్ర నటుడిలా అనిపించరు. కొత్తవాడైనప్పటికీ ఒక పల్లెటూరి యువకుడి పాత్రలో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఎమోషన్ పండించడంలో సక్సెస్ అయ్యారు. అన్విష తనదైన కథానాయకి పాత్రలో చాలా బాగా నటించారు. ఒక చిన్నపాటి టౌన్ అమ్మాయి లాగా తన పాత్రకు తగ్గట్లు డ్రెస్సింగ్ అలాగే చదువుకున్న తీరులోనే ప్రవర్తనతో ఈ సినిమాలో ప్రేక్షకులను మెప్పించే విధంగా నటించారు. గ్లామర్ అవసరం లేని పాత్రలో ఆమె నటన శైలికి ఇంప్రెస్ అవ్వాల్సిందే. తండ్రి పాత్రలో కిట్టయ్య సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ఇప్పటికే ఎన్నో చిత్రాలు వివిధ పాత్రలో నటించిన ఆయన ఈ చిత్రంతో మరొక మెట్టు పైకి వెళ్లారు. తల్లి పాత్రలో రూపకళ చాలా బాగా నటించారు. అలాగే హీరోకు మిత్రులుగా ఉన్న ఇరువురు తమ పాత్రకు తగ్గట్లు మంచి హాస్యాన్ని పండిస్తూ మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు. అలాగే సినిమాలో నటించిన ఇతర నటీనటులు అంతా తమ తమ పాత్రల పరిధిలో నటిస్తూ సినిమాకు బోనస్గా నిలిచారు.

సాంకేతిక విశ్లేషణ :
ఒక సాధారణ కథను రాసుకుని దానిని వెండితెరపై ప్రేక్షకులు ఎంటర్టైన ఏవిధంగా అలాగే కథలోని అంశాలను గమనించే విధంగా నటిస్తూ దర్శకత్వం చేయడం అనేది చాలా చాలెంజింగ్ విషయం. అటువంటి చాలెంజ్ అధిరోహిస్తూ దుర్గా దేవ్ నాయుడు ఈ సినిమాలోని ప్రతి అంశాన్ని చాలా సున్నితంగా హ్యాండిల్ చేసి విజయం సాధించారు. 2009 నాటి సమయంలో జరిగిన కథ కాబట్టి సెల్ఫోన్ వంటివి సినిమాలో ఎక్కడా కనిపించకుండా చాలా జాగ్రత్త పడుతూ టెక్నికల్ గా నాకు చిత్రమని చూపించడంలో సక్సెస్ అయ్యారు. అలాగే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అందమైన పల్లెటూరును వివిధ కోణాలలో చూపిస్తూ ప్రతి లొకేషన్ వాడుకుంటూ సినిమాను కళ్ళకు కట్టినట్లు అద్భుతంగా చూపించారు. సినిమాలోని పాటలు బాగున్నాయి. బిజిఎం చిత్రానికి బోనస్గా నిలిచింది. నిర్మాణ విలువ అద్భుతంగా ఉన్నాయి.

చిత్ర విశ్లేషణ :
ఒక సాధారణ కథను ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ గా ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమా ఉండటం ఒక సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో కుటుంబ విలువలు, స్నేహబంధాలతోపాటు ఎంతో క్లిష్టమైన ఎమోషనల్ సీన్స్ ఉండటం ప్రేక్షకుల గుండెలు పిండేస్తాయి. ఫ్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్ కు ఎంతటి వారైనా కంటతడి పెట్టాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :
దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, నటీనటుల నటన, మ్యూజిక్, ఎమోషన్స్.

మైనస్ పాయింట్స్ :
కొత్త నటీనటులు, సాధారణ కథ.

సారాంశం :
ఒక సాధారణ పల్లెటూరులోని స్వచ్ఛమైన ప్రేమ కథ “ఐ యామ్ హ్యాండ్సమ్”. కుటుంబ సమేతంగా థియేటర్లో ఎమోషన్స్ తో చూడదగిన చిత్రం.

Related Articles

Latest Articles