
మెగా పవర్ స్టార్ హీరోగా, దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలన ఓపెనింగ్స్ నమోదు చేసింది. తొలి రోజే రూ.135.36 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి భారీ విజయాన్ని అందుకుంది.
సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటనకు విశేష ప్రశంసలు దక్కుతున్నాయి. బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో కలిపి సుమారు 30 లక్షల టికెట్లు అమ్ముడవడం సినిమాపై ఉన్న క్రేజ్‌ను చూపిస్తోంది.
ఓవర్సీస్‌లో కూడా ‘పెద్ది’ దూసుకుపోతోంది. ఉత్తర అమెరికాలో ప్రీమియర్స్, తొలి రోజు కలెక్షన్లు కలిపి 2 మిలియన్ డాలర్ల మార్క్‌కు చేరువైంది. హిందీ మార్కెట్‌లో కూడా సాయంత్రం, రాత్రి షోల నుంచి మంచి వసూళ్లు నమోదయ్యాయి.
పాజిటివ్ టాక్, వీకెండ్ అడ్వాంటేజ్‌తో రాబోయే రోజుల్లో ‘పెద్ది’ మరింత భారీ వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రేడ్ వర్గాలు ఈ చిత్రానికి దీర్ఘకాల విజయవంతమైన థియేట్రికల్ రన్ ఉంటుందని అంచనా వేస్తున్నాయి.


