సందీప్ కిషన్ కొత్త సినిమా ‘పవర్ పేట’ పోస్టర్ విడుదల

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సందీప్ కిషన్ సినీ ప్రయాణానికి 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు. కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించే ప్రసిద్ధ నిర్మాణ సంస్థ 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ‘పవర్ పేట’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు.
ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా, గ్రిప్పింగ్‌గా ఉంది. నెత్తురోడుతున్న చదరంగం, పగిలిపోయిన పావులు, అందులో నలిగిపోయిన గులాబీ.. ఇవన్నీ చూస్తుంటే ఇదొక ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ స్టోరీ అని అర్థమవుతోంది. “ప్రేమ. గౌరవం. రాజకీయం.” (Love. Honour. Politics.) అనే మూడు అంశాల చుట్టూ ఈ కథ సాగనుందని పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ తన కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని అత్యంత పవర్‌ఫుల్ పాత్రలో, కొత్త లుక్‌లో కనిపించనున్నారు.
ఈ సినిమాకు అత్యంత బలమైన టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తుండగా, మది సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

  • నటీనటులు: సందీప్ కిషన్
  • రచన, దర్శకత్వం: కృష్ణ చైతన్య
  • నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
  • బ్యానర్: 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్
  • సంగీతం: మణిశర్మ
  • సినిమాటోగ్రఫీ (DoP): మది
  • ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
  • ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ, మౌనిక
  • సౌండ్ డిజైన్: సచిన్ సుధాకరన్, హరిహరన్
  • పీఆర్ఓ: వంశీ – శేఖర్
    త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర బృందం ప్రకటించనుంది.

Related Articles

Latest Articles