ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి సందర్భంగా ‘రామ’ గ్లింప్స్‌ లాంచ్

2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘రామాయణం’ ఒకటి. ఇది ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపొందుతున్న ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా రూపుదిద్దుకుంటోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ ఇతిహాసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ట్యాలెంటెని  ఒకచోట చేర్చి, ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికను సిద్ధం చేస్తోంది.

ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ, మార్చి 27న జరుపుకున్న పవిత్రమైన ‘రామ నవమి’ సందర్భంగా, నిర్మాత నమిత్ మల్హోత్రా తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.  ‘రామాయణం’ నిర్మాణ ప్రయాణం వెనుక ఉన్న తన వ్యక్తిగత భావాలను పంచుకుంటూనే, ఒక కీలకమైన తాజా సమాచారాన్ని రివిల్ చేశారు

 “శుభ రామ నవమి!
ఇది మనందరికీ చెందిన కథ. మన  ‘రామాయణం’ను దాని నిజమైన స్ఫూర్తితో, పూర్తి స్థాయి ఘనతతో, అత్యంత చిత్తశుద్ధితో తెరపైకి తీసుకురావడానికి మేము వేసే ప్రతి అడుగుకూ అపారమైన బాధ్యత, భక్తి శ్రద్ధలే మార్గదర్శకాలుగా నిలిచాయి.

మేము మా నెక్స్ట్ ‘గ్లింప్స్’ అయిన’రామ’ను ఏప్రిల్ 2న, పవిత్రమైన ‘హనుమాన్ జయంతి’ సందర్భంగా విడుదల చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా మేము చేసిన కృషిని, అభిమానులతో కలిసి ప్రపంచవ్యాప్తంగా ఒక ఘనమైన లాంచ్ వేడుక ద్వారా ప్రదర్శించనున్నాం. ఈ క్షణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుందాం.
మీ ప్రేమ, నమ్మకానికి ధన్యవాదాలు- నమిత్ మల్హోత్రా

సుమారు 5,000 సంవత్సరాల క్రితం నాటి కథగా, కోట్లాది మంది ప్రజల ఆదరణ పొందిన ‘రామాయణం’ కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు; అది తరతరాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయే ఒక శాశ్వత వారసత్వం. ఈ చిత్రం  ‘ఫస్ట్ లుక్’  ప్రపంచవ్యాప్తంగా భారీ సంచలనాన్ని సృష్టించింది. భారతదేశంలోని పలు నగరాల్లో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమాలు, అలాగే న్యూయార్క్‌లోని ‘టైమ్స్ స్క్వేర్’లో ఆకట్టుకునే రీతిలో ప్రదర్శించడం ద్వారా, ఈ చిత్రం భారీ స్థాయిని, గొప్ప ఆశయాలను ప్రపంచానికి చాటిచెప్పారు. ఈ ఉత్సహాన్ని కొనసాగిస్తూ, రాబోయే ఈ ఆవిష్కరణ కేవలం ఒక ప్రకటనగా మాత్రమే కాకుండా, భౌగోళిక ప్రాంతాలకు అతీతంగా ప్రేక్షకులను ఏకం చేస్తూ, రాముని ప్రపంచవ్యాప్త అభిమానుల వేడుకగా నిలవనుంది.

రణబీర్ కపూర్ శ్రీరాముని పాత్రలో, సాయి పల్లవి సీతగా, రాకింగ్ స్టార్ యష్ రావణునిగా, సన్నీ డియోల్ హనుమంతునిగా,  రవి దూబే లక్ష్మణునిగా నటిస్తుండటంతో రామాయణం జనరేషన్ లో ఒక్కసారే వచ్చే ప్రపంచ అద్భుత దృశ్యంగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పుడు హనుమాన్ జయంతి నాడు జరగనున్న ‘రామ’ లాంచ్ పై అందరి దృష్టి ఉంది.

నితేష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, 8 సార్లు ఆస్కార్ గెలుచుకున్న DNEG, యష్‌ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ‘రామాయణం’ రెండు భాగాలుగా  ప్రపంచవ్యాప్తంగా IMAXలో విడుదల కానుంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి.

Related Articles

Latest Articles