
గం గం గణేష్ చిత్రంతో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి నయన్ సారిక ప్రస్తుతం విష్ణు విన్యాసం చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గతంలో ఆయ్, క వంటి చిత్రాలతో మంచి విజయవంతమైన సినిమాలను అందుకున్న నయంసారిక ప్రస్తుతం విష్ణు విన్యాసం చిత్ర విజయంతో హ్యాట్రిక్ హీరోయిన్ గా ప్రేక్షకులను మరొకసారి పలకరించారు. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు తో కలిసి ఆమె ఇదే తొలిసారి నటించడం. అయితే ఈ చిత్రంలో తన పాత్ర కాస్త భిన్నంగా ఉండటంతో సినిమాలో ముఖ్య ఆకర్షణగా నిలిచారు. కథ అంతా ఆమె చుట్టూనే తిరగడంతో సినిమాలో ఆమె పర్ఫామెన్స్ కు ఎక్కువ స్కోప్ లభించింది. సాధారణంగా కామెడీ పండించడం చాలా కష్టం అని అందరికీ తెలిసిన విషయమే. అందులను ఒక సినిమాలోని కథ అమ్మాయి చుట్టూ తిరుగుతుందంటే అక్కడ ఎవరి మనోభావాలు ఎటువంటి విధంగాను దెబ్బ తినకుండా ప్రేక్షకులను నవ్వించడం చాలా కష్టమైన విషయం. కానీ ఈ చిత్రంలో అటువంటి పొరపాట్లు ఏమీ జరగకుండా ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేసే విధంగా జాగ్రత్తపడ్డారు.
శ్రీ విష్ణు నటన గురించి అందరికీ తెలిసిందే. ఆయన పాత్ర ఎటువంటిది అయినా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా ఉంటారు. అయితే హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఉండటంతో ఈ సినిమాలో శ్రీ విష్ణు వంటి నటుడుకి పోటాపోటీగా నయన్ సారిక నాటించారు. టైలర్ లో చూస్తేనే ప్రేక్షకులకు ఒక అవగాహన వచ్చే విధంగా ఆమె పాత్రను చూపించడం జరిగింది. అదేవిధంగా ఆమె పాత్ర కాస్త బోలెడుగా ఉన్నప్పటికీ దాని వెనుక ఉన్న పరిస్థితుల వల్ల ఆమె ఎమోషన్స్ కూడా చూపించడానికి ఎక్కువ స్కోప్ లభించింది. అటువంటి ఎమోషన్స్ గతంలో ఎందరో హీరోయిన్స్ పండించిన పనికి ఈమె పాత్ర విభిన్నం కావడంతో ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకున్నారు. ఎక్స్ప్రెషన్స్ చూపించడం నుండి డాన్స్ పర్ఫార్మెన్స్ వరకు ప్రతి చిన్న విషయంలను జాగ్రత్తలు తీసుకొని ఆమె పెర్ఫార్మ్ చేసినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆమె తెలుగు అమ్మాయి కనపడితే ఎంతో స్పష్టంగా తెలుగు మాట్లాడుతూ ఇటువంటి నటి తెలుగు చిత్రపరుశ్రమకు దొరకడం అనేది ఒక వరంగా కొంతమంది సోషల్ మీడియా ద్వారా చెప్తున్నారు. ముందు ముందు మరిన్ని పెద్ద నిర్మాణ సంస్థల ద్వారా ఈమెను చూడబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిహారిక కొణిదెల నిర్మిస్తున్న సంగీత శోభన్ రాకాస చిత్రంలో అనే త్వరలో ప్రేక్షకులను మరొకసారి పలకరించనున్నారు.


