సన్ నెక్ట్స్‌లో ఆకట్టుకుంటోన్న ‘నీలకంఠ’

మాస్టర్ మహేంద్రన్ హీరోగా రీసెంట్‌గా వచ్చిన చిత్రం ‘నీలకంఠ’. ఈ మూవీలో నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్లుగా నటించారు. ఎం మమత, ఎం రాజరాజేశ్వరి సమర్పణలో మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రంలో మాస్టర్ మహేంద్రన్ అద్భుతమైన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లో అతని నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది.

సన్ నెక్ట్స్‌లో ఈ మూవీ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఓటీటీ ఆడియెన్స్‌ని కూడా ఈ చిత్రం మెప్పిస్తోంది. స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఊరు.. ఊర్లోని కట్టుబాట్లు.. చిన్నప్పుడు చేసిన తప్పుకి శిక్షను అనుభవించడం.. మధ్యలో తన ప్రేమను గెలిపించేందుకు హీరో పడే కష్టాలు.. చివరకు సర్పంచ్ పదవికి పోటీ చేయడం వంటి ఆసక్తికరమైన అంశాలతో ‘నీలకంఠ’ మూవీని అద్భుతంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

ఇందులోని రాంకీ పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. మార్క్ ప్రశాంత్ మ్యూజిక్, బీజీఎం మెయిన్ ఎస్సెట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఓటీటీలో ఈ మూవీ అయితే ట్రెండ్ అవుతోంది.

Related Articles

Latest Articles