
తెలుగు సినీ హీరో నవీన్ చంద్ర, తన నటించిన ‘హని’ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానున్న సందర్భంగా స్వామివారి ఆశీస్సులు అందుకోవడానికి తిరుమలకు వచ్చారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన దర్శనంతో స్వామి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ… తలకోనలో తన చిత్ర నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు. షూటింగ్‌లో కాస్త విరామం రావడంతో తిరుమలకు వచ్చినట్లు చెప్పారు. స్వామి దర్శనం అద్భుతంగా జరిగిందని, టీటీడీ భక్తులకు మంచి ఏర్పాట్లు చేస్తుందని ప్రశంసించారు. హీరో నవీన్ చంద్ర తో పాటు చిత్ర నిర్మాత, పంపిణీదారుడు హరీష్ పాల్గొన్నారు. ఫిబ్రవరి 6న విడుదలవుతున్న ‘హనీ’ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.


