
ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తండ్రి ఈదర వెంకట్రావు (90) వృద్ధాప్య కారణాలతో కన్నుమూశారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య వెంకటరత్నం 2019 మే 27న మరణించారు. వెంకట్రావు గారికి ముగ్గురు కుమారులు – ఈవీవీ సత్యనారాయణ, ఈవీవీ గిరి, ఈవీవీ శ్రీనివాస్ & ఒక కుమార్తె ముళ్ళపూడి మంగాయమ్మ ఉన్నారు. ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ వారి మనుమలు.
నిడదవోలు మండలం కోరుమామిడిలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు దుఃఖంలో మునిగిపోయారు.


