“పతంగ్” చిత్ర రివ్యూ

ప్రణీత్ ప్రత్తిపాటి రచన దర్శకత్వంలో నాని బండ్రెడ్డి, విజయ్ శేఖర్ అన్నే, సురేష్ కోతింటి, సంపత్ మాకా, నిఖిల్ కోడూరు నిర్మాతలకు సురేష్ బాబు సమర్పణలో క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం పతంగ్. ప్రణవ్ కౌశిక్, భాను ప్రకాష్ హీరోలుగా పరిచమవుతున్న ఈ చిత్రంలో ప్రీతి పగడాల హీరోయిన్గా నటించగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రముఖ పాత్ర పోషించారు. ఎస్పీ చరణ్, ఎస్ఎస్ కాంచి, కేశవ్ దీపక్, వంశి పూజిత్ తదితరులు కీలకపాత్ర పోషించారు. శక్తి అరవింద్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈ చిత్రానికి జోస్ జిమ్మీ సంగీతాన్ని అందించారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
చిన్నప్పటినుండి ఇద్దరు స్నేహితులు కలిసిమెలిసి ఉంటారు. వారు పెరుగుతున్న కొద్ది వాడి మధ్య స్నేహబంధం కూడా అలాగే పెరుగుతుంది. వారిలో ఒకరు బస్తీ కుర్రాడు, మరొకరు సెట్టిల్డ్ కుటుంబం. వారిద్దరి జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి కోసం గొడవపడ్డ ఇద్దరు పతంగుల పోటీలో ఎవరు గెలిస్తే వారికే ఆ అమ్మాయి సొంతమని ఒక బంధం వేసుకుంటారు. అయితే ఈ కథలోకి గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఎలా వస్తారు? వారిలో ఎవరు గెలుస్తారు? పోటీ తర్వాత ఏం జరుగుతుంది? అనే అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై పతంగ్ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటులు :
తొలిచిత్రమైనప్పటికీ ఈ చిత్రంలో హీరోలగా నటించిన ప్రణవ్ కౌశిక్, భాను ప్రకాష్ కొత్త హీరోలుగా అనిపించకుండా ఎంతో అద్భుతంగా నటించారు. ఫ్రెండ్షిప్ నుండి కోపం వరకు ప్రతి ఎమోషన్ క్యారీ చేస్తూ వారిని వారు ప్రూవ్ చేసుకున్నారు. హీరోయిన్గా నటించిన ప్రీతి పగడాల చాలా బాగుంది. కన్ఫ్యూజింగ్ స్టేట్ లో ఉండే ఒక సెటిల్ పర్ఫార్మెన్స్ తో తన పాత్రను పర్ఫెక్ట్ గా చూపించారు. గౌతమ్ వాసుదేవ్ మేనన్ పాత్ర ఈ చిత్రంలో ప్రత్యేకమైనది. సినిమా అంతటా తన మాటలు అలాగే డైలాగులు చాలా ఎంటర్టైన్ చేస్తాయి. అలాగే ఎస్పీ చరణ్ పాత్ర తెరపై కనిపించడం తక్కువ అయినప్పటికీ సినిమాలో మంచి ఇంపాక్ట్ సృష్టించారు. అలాగే ఇతర నటీనటులు అందరూ తమ తమ పాత్రల పరిధిలో నటిస్తూ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చారు.

సాంకేతిక విశ్లేషణ :
ఒక ప్రాంతీయ ఫ్యాక్టర్ ఆఫ్ లో వచ్చిన చిత్రాలకు సాధారణంగా ఈ ఆశలు కాస్త అటు ఇటుగా అవుతూ ఉంటాయి కానీ ఈ చిత్రం హైదరాబాద్ పాత బస్తి వంటి బ్యాక్ డ్రాప్ తో రావడంతో అక్కడ భాష, యాస పర్ఫెక్ట్ గా రావడంతో సినిమా పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. ఒక సింపుల్ కథను ఎంటర్టైనింగ్ మార్గంలో ప్రేక్షకులు ముందుకు తీసుకు రావడంలో దర్శకుడు విజయ సాధించారు. చిన్న నిర్మాతలు అయినప్పటికీ ఎక్కడ నిర్మాణ విలువల లోపం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. పతంగులు ఎగరేసే సీన్లు అన్ని విఎఫ్ ఎక్స్ తో అద్భుతంగా వచ్చాయి. సినిమాటోగ్రఫీ, విజువల్స్ ఇంకా కలరింగ్ బాగున్నాయి. లొకేషన్స్ అన్ని నేచురల్ గా అనిపిస్తున్నాయి. బిజిఎం ఇంకా పాటలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
కథ, దర్శకత్వం, విఎఫ్ఎక్స్, నిర్మాణ విలువలు, పాటలు.

మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడ కొంచెం స్లోగా ఉండటం.

సారాంశం :
సరదాగా కుటుంబ సమేతంగా కూర్చుని నవ్వుకుంటూ ఎంజాయ్ చేసే చిత్రం పతంగ్.

Related Articles

Latest Articles