
దర్శకుడు పూరి జగన్నాథ్, నటుడు విజయ్ సేతుపతి క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం #పూరి సేతుపతి షూటింగ్ పూర్తయింది. ఇంటెన్స్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా చివరి రోజు షూటింగ్‌ను జరుపుకున్న సందర్భంగా, టీమ్ ఒక ఆనందకరమైన వీడియోను విడుదల చేసింది. వీడియోలో విజయ్ సేతుపతి, పూరి, చార్మీ కౌర్ మధ్య మధుర క్షణాలు కనిపిస్తాయి. విజయ్ సేతుపతి ఈ ప్రయాణాన్ని మరపురాని అనుభవంగా పేర్కొన్నారు, పూరి జాకెట్‌ను ఫన్నీగా కాంప్లిమెంట్ చేశారు.
పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ మోషన్ పిక్చర్స్ జేబీ నారాయణ రావు కొండ్రోళ్ల సంయుక్త నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో సమ్యుక్త హీరోయిన్‌గా నటిస్తుండగా, టబు, దునియా విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ హాస్య పాత్రల్లో కనిపించనున్నారు.
నేషనల్ అవార్డ్ విన్నర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు. షూటింగ్ పూర్తి కావడంతో ప్రమోషన్లు ప్రారంభమవుతాయి. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ త్వరలో విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది.


