
కొత్తదనానికి పెద్దపీట వేస్తూ, సీనియర్ నటుల అనుభవాన్ని జోడిస్తూ దర్శక-నిర్మాత నంది వెంకట్ రెడ్డి ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. శ్రీ శివసాయి ఫిల్మ్స్ బ్యానర్‌పై నంది వెంకట్ రెడ్డి స్వయంగా దర్శకత్వం-నిర్మాణం చేస్తున్న చిత్రం ‘ఇంద్రావతి’. మూరంరెడ్డి వెంకటేశ్వర్లు, వడ్ల సిద్ధార్థ, యందూరి నిహారిక చౌదరి, ఈది సుష్మ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటులు సుమన్, లంకెల అశోక్ రెడ్డి, ఘర్షణ శ్రీనివాస్, టార్జాన్, దిల్ రమేష్, చిత్రం శీను, అర్చన, ధనుంజయ, నగేష్ తదితరులు కీలక పాత్రల్లో కనువిందు చేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టీజర్‌ను ఆవిష్కరించారు.
చీఫ్ గెస్ట్‌గా హాజరైన దర్శక-నిర్మాత సంజీవ్ కుమార్ మేగోటి మాట్లాడుతూ.. “టీజర్ అద్భుతంగా ఉంది. సినిమా క్వాలిటీగా తెరకెక్కుతోంది. నంది వెంకట్ రెడ్డి గారు గతంలో తీసిన ‘తారకేశ్వరి’ సినిమా పాటలను మా అన్విక ఆడియో ద్వారా విడుదల చేశాం. చిన్న సినిమాలతో ప్రారంభమైన శ్రీ శివసాయి ఫిల్మ్స్ బ్యానర్ ఇప్పుడు పెద్ద స్థాయికి చేరాలి. మొత్తం చిత్ర యూనిట్ ఒక కుటుంబంలా కలిసికట్టుగా పనిచేస్తోంది. ‘ఇంద్రావతి’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్!” అని హృదయపూర్వకంగా ఆకాంక్షలు తెలిపారు.
సీనియర్ నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ, “వెంకట్ రెడ్డి గారు తమ వద్ద ఉన్న వనరులను సరైన విధంగా ఉపయోగించుకుని నాణ్యతతో సినిమాలు తీస్తున్నారు. అవకాశం ఉన్నంత వరకు క్వాలిటీని రాజీ పడకుండా చేసే వారే నిజమైన క్రియేటివ్ పర్సన్స్. సీనియర్ ఆర్టిస్టులను గౌరవిస్తూనే, నూతన తరం ప్రతిభకు అవకాశాలు కల్పిస్తూ మంచి సినిమాలు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ గౌరవించే మంచి మనిషి వెంకట్ రెడ్డి గారు. ‘ఇంద్రావతి’ టీమ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు” అని కొనియాడారు.
దర్శక-నిర్మాత నంది వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, “ఈ చిత్రంలో కొత్త టాలెంట్ ఉట్టిపడుతున్న నటీనటులే ఉన్నారు. కొత్త కథానాయకులు అద్భుతంగా నటించారు. సీనియర్ ఆర్టిస్టులు కూడా తమ అనుభవంతో సినిమాకు మరింత బలం చేకూర్చారు. త్వరలోనే ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహిస్తాం. చిత్ర విడుదల తేదీతో సహా మిగతా వివరాలు ప్రకటిస్తాం” అని తెలిపారు.
హీరోలు మూరంరెడ్డి వెంకటేశ్వర్లు, వడ్ల సిద్ధార్థ, హీరోయిన్లు యందూరి నిహారిక చౌదరి, ఈది సుష్మలు మాట్లాడుతూ అవకాశం ఇచ్చిన నంది వెంకట్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. చీఫ్ గెస్టులుగా హాజరైన సౌమిత్ మీడియా సీఈవో డా. వంశీకృష్ణ, నటుడు-నిర్మాత మూస అలీఖాన్ కూడా చిత్ర బృందాన్ని అభినందించి, విజయవంతమైన ప్రయాణాన్ని ఆకాంక్షించారు. సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఇంద్రావతి’ ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పించి సూపర్ హిట్ అవ్వడం ఖాయమని భరోసా వ్యక్తం చేశారు.
చిత్రయూనిట్ వివరాలు:
నటీనటులు: . మూరంరెడ్డి వెంకటేశ్వర్లు, వడ్ల సిద్ధార్థ, యందూరి నిహారిక చౌదరి, ఈది సుష్మ, సీనియర్ నటులు సుమన్, లంకెల అశోక్ రెడ్డి, ఘర్షణ శ్రీనివాస్, టార్జాన్, దిల్ రమేష్, చిత్రం శీను, అర్చన, ధనుంజయ, నగేష్ తదితరులు.
దర్శకత్వం, నిర్మాత: నంది వెంకట్ రెడ్డి
మ్యూజిక్: డ్రమ్స్ రాము
డైలాగ్‌లు: విక్రమ్ కుమార్
డీవోపీ: డీ యాదగిరి
ఎడిటింగ్: సాయికుమార్
పీఆర్‌ఓ: కడలి రాంబాబు, దయ్యాల అశోక్


