ఇక ఐబొమ్మ లేనట్టేనా!

ఇటీవల కాలంలో పరిస్థితికి సంబంధించి కొన్ని అరెస్టులను హైదరాబాదులో చూడడం జరిగింది. ఈ ప్రయాణంలోని తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలతో కలిసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అతి కష్టం మీద ఈ పరిస్థితి సంబంధించిన ఒక వ్యక్తిని ఇటీవలే అరెస్టు చేశారు. ఇదే ప్రయాణంలో తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నటువంటి పైరసీ మహమ్మారి ఐబొమ్మ వెబ్సైటుకు సంబంధించి కొంత సమాచారం పోలీసులకు లభించగా ఆ వెబ్సైట్ వారు పోలీసులను హెచ్చరిస్తూ మా దగ్గర సుమారు 5 కోట్ల మంది వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ ఉందని, మా జోలికి వస్తే ఆ ఇన్ఫర్మేషన్ బయట పెడతామని బెదిరించే ప్రయత్నం చేశారు.

ఇది ఇలా ఉండగా నిన్న ఐబొమ్మ వెబ్సైట్ కు సంబంధించిన యజమానిగా వినిపిస్తున్న ఇమ్మద్ది రవి అనే వ్యక్తి ఫ్రాన్స్ నుండి హైదరాబాదుకు రాగా ఇక్కడ కూకట్పల్లిలోని సిసిఎస్ పోలీసులు అతనిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఇతను ఈ పైరసీ వెబ్సైట్ ను కరేబియన్ ఐలాండ్స్ నుండి ఆపరేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

Latest Articles