‘గత వైభవం’ ట్రైలర్ విడుదల

ఎస్‌ఎస్ దుష్యంత్, అశికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా ‘గత వైభవం’ ఈ నెల 14న విడుదల కానుంది. సుని దర్శకత్వంలో, ఆయనతో పాటు దీపక్ తిమ్మప్ప నిర్మాణంలో సుని సినిమాస్, సర్వేగర సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌లపై రూపొందుతోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి తెలుగు రాష్ట్రాలు, నార్త్ అమెరికా, కెనడాలో విడుదల చేస్తున్నారు.

గతవైభవం ట్రైలర్ విడుదలైంది. నాలుగు విభిన్న కాలాల్లో సాగే కథను పరిచయం చేస్తోంది. పోర్చుగీస్ యుగం నుంచి దేవలోకం, రాజుల కాలం, ప్రస్తుత యుగం వరకు ప్రేమికుల ప్రేమకథను అల్లుకుంటుంది. ప్రతి యుగంలో వారు ఎదుర్కొనే సవాళ్లు, చివరికి ప్రస్తుతంలో కలుస్తారా? అనేది సస్పెన్స్.

సుని దర్శకత్వంలో నాలుగు యుగాలను అథెంటిక్‌గా చూపించారు. శివకుమార్, ఉల్లాస్ హైదూర్, రఘు మైసూర్ ప్రొడక్షన్ డిజైన్ అద్భుతం. విలియం జె. డేవిడ్ సినిమాటోగ్రఫీ, జూడా సంధ్య సంగీతం మూడ్‌ను పెంచాయి. దుష్యంత్, అశికా విభిన్న లుక్స్‌లో మెప్పించారు.

రొమాన్స్, మిథాలజీ, పునర్జన్మ, పీరియడ్ డ్రామా మిక్స్‌తో విఎఫ్‌ఎక్స్ స్పెక్టాకిల్‌గా రూపొందిన ఈ సినిమా భావోద్వేగాలు, గ్రాండ్ విజువల్స్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. నాలుగు రోజుల్లో విడుదలకు సిద్ధమవుతోంది.

Related Articles

Latest Articles