సచిన్ టెండుల్కర్, సుజిత్ కలయికలో టెక్నో పెయింట్స్ నూతన అధ్యాయం

దేశవ్యాప్తంగా విశ్వసనీయతకు ప్రతీకగా నిలుస్తున్న టెక్నో పెయింట్స్ మరో వినూత్న ప్రకటనను రూపొందించింది. భారత క్రికెట్‌కు చిరస్థాయి ప్రతిష్టను తీసుకొచ్చిన గాడ్ ఆఫ్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గారితో తమ బ్రాండ్ అంబాసిడర్ గా గ్రాండ్ యాడ్ ను రూపొందించారు. ఈ ప్రకటనను పవన్ కళ్యాణ్ తో ఇటీవల OG చిత్రాన్ని తెరకెక్కించిన సుజీత్ గారు దర్శకత్వం వహిస్తున్నాడు. బ్రాండ్ ది ఒరిజినల్స్ సంస్థ నిర్మించింది.
ప్రమోషనల్ ఈవెంట్స్ లో అగ్రగామి సంస్థగా పేరొందిన
శ్రేయస్ మీడియా advertising డివిజన్ Brande ఏజెన్సీ కోర్డినేటర్ గా వ్యవహారించింది. రంగులు కేవలం గోడలపై మాత్రమే కాక, మన హృదయాల్లోనూ కళాత్మక భావాలను ప్రతిబింబిస్తాయనే భావనతో రూపొందించిన ఈ ప్రకటన, ప్రజలకు మరింతగా చేరువ కావడమే ప్రధాన లక్ష్యంగా రూపొందించారు.

ఈ సందర్భంగా టెక్నో పెయింట్స్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ:
“భారతదేశంలో చిత్రకళాభావనను, రంగుల సంస్కృతిని కొత్త కోణంలో పరిచయం చేయాలనే మా సంకల్పానికి శ్రీ సచిన్ టెండూల్కర్ గారిలాంటి ప్రతిష్టాత్మక వ్యక్తితో భాగస్వామ్యం కావడం మాకు గర్వకారణంగా ఉంది. అలాగే OG చిత్ర దర్శకుడు సుజిత్ ఈ యాడ్ ను అత్యంత అద్భుతంగా గ్రాండ్ గా తీర్చిదిద్దారు.” అని తెలిపారు.

తాజాగా ఈ యాడ్ చిత్రీకరణ విజయవంతంగా పూర్తయింది. త్వరలోనే ఈ ప్రకటన అన్ని మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

Latest Articles