
రామ్ మిరియాల పాడితే ఆ పాట ఛాట్ బస్టర్ కావాల్సిందే. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే..’, ‘టిల్లు అన్న డీజే పెడితే..’, ‘ఛమ్కీల అంగీలేసి..’, ‘ఊరు పల్లెటూరు..’, ‘టికెట్ ఏ కొనకుండా..’, ‘సుఫియానా…’ ఇలా రామ్ మిరియాల పాటలన్నీ మ్యూజిక్ లవర్స్ కు ఫేవరేట్ సాంగ్స్ అయ్యాయి. ఈ వెర్సటైల్ సింగర్ “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా టైటిల్ సాంగ్ పాడారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను సునీల్ కశ్యప్ కంపోజ్ చేశారు.
ఈ పాట ఎలా ఉందో చూస్తే – ‘సంతాన ప్రాప్తిరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు…సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తూ, ఆల్ ది బెస్టు, నెత్తిన జిలకర బెల్లం పెట్టు, మంగళసూత్రం మెళ్లోన కట్టు, లక్షలు వోసి దావత్ వెట్టు, కొత్తగ వేరే కాపురమెట్టు, నీదేమో నైట్ షిఫ్టు, నీ వైఫుది మార్నింగ్ షిఫ్టు, వీకెండ్ లో రొమాన్స్ కు ప్లానింగ్ చేసి లెక్కలుగట్టు…’ అంటూ ప్రస్తుత కాలంలో యూత్ మ్యారీడ్ లైఫ్ స్టైల్ ను చూపిస్తూ సాగుతుందీ పాట.
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్, ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
నటీనటులు – విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్థన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్య కృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనిల్ గీల, సద్దామ్, రియాజ్, తదితరులు
టెక్నికల్ టీమ్
డైరెక్టర్ – సంజీవ్ రెడ్డి
ప్రొడ్యూసర్స్ – మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే – సంజీవ్ రెడ్డి, షేక్ దావూద్.జి
సినిమాటోగ్రఫీ – మహిరెడ్డి పండుగుల
మ్యూజిక్ డైరెక్టర్ – సునీల్ కశ్యప్
డైలాగ్స్ – కల్యాణ్ రాఘవ్
ఎడిటర్ – సాయికృష్ణ గనల
ప్రొడక్షన్ డిజైనర్ – శివకుమార్ మచ్చ
కాస్ట్యూమ్ డిజైనర్స్ – అశ్వత్ భైరి, కె.ప్రతిభ రెడ్డి
కొరియోగ్రాఫర్ – లక్ష్మణ్ కాళహస్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎ మధుసూధన్ రెడ్డి
మార్కెటింగ్, ప్రమోషన్స్ కన్సల్టెంట్ – విష్ణు కోమల్ల
లిరికల్ కంపోజిషన్ – రైట్ క్లిక్ స్టూడియో
డిజిటల్ – హౌస్ ఫుల్ డిజిటల్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్- శ్రీనివాస్)


