
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రసాదానికి రాజమౌళి దర్శకత్వంలోని #SSMB29 చిత్రీకరణలో ఎంతో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్ తో హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అర్థమవుతుంది. కాకపోతే ఈ చిత్రం నుండి అఫీషియల్ వార్తలు చాలా తక్కువగా వస్తున్నాయి. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఒక లాకెట్ పోస్ట్ మహేష్ బాబు పుట్టినరోజున విడుదలై ఎంతో వైరల్ గా మారింది. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని లీక్స్ వస్తున్నప్పటికీ ఈ చిత్ర బంధం ఈ సినిమా నుండి ఎటువంటి లీక్స్ కాకుండా ఎంతో జాగ్రత్త పడుతూ వస్తున్నారు. ఇకపై ఎవరైనా ఈ చిత్రానికి సంబంధించి లీడ్స్ బయట విడుదల చేస్తే దానిపై కఠినంగా చర్యలు ఉండబోతాయని కూడా హెచ్చరించడం జరిగింది. అయితే ఈ సినిమా నుండి అప్డేట్లు తక్కువగా ఉండటంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో నిరుత్సాహపడుతున్నారు. ఇది ఇలా ఉండగా మహేష్ బాబు తన సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్టు మాల్దీవ్స్ ను ట్యాగ్ చేస్తూ “Absolute bliss! Thank you Joali for a wonderful day🌊” అంటూ మహేష్ బాబు పెట్టిన పోస్ట్ ఎంతో వైరల్ గా మారింది. ఈ పోస్టును అభిమానులు తుఫాను, పెను తుఫాను వస్తుంది అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.


