“చిరంజీవ” ట్రైలర్ రిలీజ్ – నవంబర్ 7 నుంచి ఆహాలో స్ట్రీమింగ్

రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఆహా ఒరిజినల్ ఫిల్మ్ “చిరంజీవ”. ఈ చిత్రంలో కుషిత కల్లపు హీరోయిన్ గా నటించింది. స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ నిర్మించారు. అభినయ కృష్ణ దర్శకత్వం వహించారు. నవంబర్ 7వ తేదీ నుంచి చిరంజీవ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

చిరంజీవ మూవీ ట్రైలర్ ఎంటర్ టైన్ మెంట్, లవ్, యాక్షన్ తో ఆకట్టుకుంది. శివ(రాజ్ తరుణ్) పుట్టగానే మహార్జాతకుడు అవుతాడని పండితులు చెబుతారు. శివకు చిన్నప్పటి నుంచి స్పీడు ఎక్కువ. ఆంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్న శివ ఓ రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. అతనికి తెలియకుండానే కొన్ని శక్తులు వచ్చేస్తాయి. ఎవరెవరు ఎంతకాలం జీవిస్తారు అనేది శివకు తెలిసిపోతుంటుంది. ఈ క్రమంలోనే శివ రౌడీ సత్తు పైల్వాన్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సత్తు పైల్వాన్ తో చేసిన పోరాటంలో శివ గెలిచాడా లేదా అనేది ట్రైలర్ లో ఆసక్తిని కలిగించింది. హీరో హీరోయిన్స్ కుషిత కల్లపు, రాజ్ తరుణ్ పాత్రల మధ్య వచ్చిన క్యూట్ లవ్ స్టోరీ కూడా ఆకట్టుకుంది. చిరంజీవ సినిమా ఆహా ఓటీటీకి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కానుందని టీజర్ తో తెలుస్తోంది.

నటీనటులు – రాజ్ తరుణ్, కుషిత కల్లపు, తదితరులు

టెక్నికల్ టీమ్

మ్యూజిక్ – అచ్చు రాజమణి
డీవోపీ – రాకేష్ ఎస్ నారాయణ్
ఎడిటింగ్ – సాయి మురళి
స్క్రీన్ ప్లే – ఎం.ఆర్
పీఆర్ఓ- జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్
డైరెక్షన్ – అభినయ కృష్ణ

Related Articles

Latest Articles