
‘నాటకం’, ‘తీస్ మార్ ఖాన్’ వంటి డిఫరెంట్ చిత్రాలతో దర్శకుడిగా కళ్యాణ్ జీ గోగణ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ‘మారియో’తో మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా ‘ఎ టర్బో-చార్జ్డ్ ర్యాంప్ రైడ్’ అనే ట్యాగ్‌లైన్‌తో హీరో అనిరుధ్, హీరోయిన్ హెబ్బా పటేల్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
ఇక ఇప్పుడు ఈ మూవీ టీం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని నవంబర్‌లో చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్గా కమర్షియల్ జానర్లో వస్తూనే.. కంటెంట్ ఓరియెంటెడ్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టుగా, ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుంది.
సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ‘మారియో’ చిత్రాన్ని నిర్మిస్తుండగా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్, రాకేందు మౌళి సంగీతాన్ని అందిస్తున్నారు. పాటలు, మాటలు రాకేందు మౌళి సమకూరుస్తున్నారు. కథ, సంభాషణలను అభివృద్ధి చేయడంలో రాకేందు మౌళి కూడా గోగణకు మద్దతు ఇచ్చారు. MN రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, మణికాంత్, మదీ మన్నెపల్లి ఎడిటర్లుగా వ్యవహరిస్తున్నారు.
తారాగణం: అనిరుధ్, హెబా పటేల్, రాకేందు మౌళి, మౌర్య సిద్ధవరం, యష్నా ముతులూరి, కల్పిక గణేష్, మదీ మన్నెపల్లి, లతా రెడ్డి తదితరులు
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్లు: సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్
నిర్మాత: సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్
కథ, దర్శకత్వం : కళ్యాణ్ జీ గోగణ
రచనా సహకారం, పాటలు : రాకేందు మౌళి
సంగీత దర్శకులు : సాయి కార్తీక్, రాకేందు మౌళి
సినిమాటోగ్రాఫర్: ఎంఎన్ రెడ్డి
ఎడిటర్: మణికాంత్, మదీ మన్నెపల్లి
PRO : సాయి సతీష్
పోస్టర్ డిజైనర్: పార్ధు క్రియేషన్స్


