‘మిత్ర మండలి’ చిత్ర రివ్యూ

బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ మీద కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ఈ మూవీలో ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం అక్టోబర్ 15 సాయంత్రం నుండి ప్రీమియర్లతో నేడు ఇది తెలుగు రాష్ట్రాలలో విడుదల అయింది. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
జంగ్లీపట్నం అని ఒక కొత్త ఊరును సృష్టించి ఆ ఊరిలో ఎక్కడలేని ఒక కులాన్ని సృష్టించారు దర్శకులు. ఆ కుల పెద్ద కూతురు నలుగురు పోకిరి కుర్రాళ్ళు అయినటువంటి మిత్ర మండలిలో ఒకడుని ప్రేమిస్తుంది. ఎంతో కుల పిచ్చి ఉన్న ఆ కుల నాయకుడు కూతురు ప్రేమ కథగా ఈ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. అయితే వారి ప్రేమ ప్రయాణం ఎలా మొదలైంది? ఆ అమ్మాయి అతడిని ప్రేమించడానికి కారణం ఏంటి? అసలు ఆ మిత్ర ముండలి యువకులు ఏం చేస్తుంటారు? చివరికి వారి ప్రేమ సఫలమైందా లేదా విఫలమైందా? వారి జీవితాల్లోకి వెన్నెల కిషోర్ ఎలా వచ్చారు? సత్య యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటులు నటన :
ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయు, ప్రసాద్ బెహరా ఈ నలుగురు జంగ్లీపట్నంలో ఉండే నలుగురు మిత్రులు. వీరిని మిత్రమండలి అనుకుంటూ ఉంటారు. చిత్రంలో ఈ నలుగురు నటనలో పోటాపోటీగా తమ తమ పాత్రలలో ఎంతో అద్భుతంగా నటించారు. ప్రతి సీనులను తమ కామెడీ టైమింగ్స్ తో ఎక్కడ తగ్గకుండా అద్భుతమైన పర్ఫార్మన్స్ ఇచ్చారు. నిహారిక ఎన్ఎం తన ఎనర్జీని ఇంస్టాగ్రామ్ రీల్స్ లో ఎలా చూపిస్తారో అదే విధంగా ఈ చిత్రంలో కూడా ఆమె తన ఫుల్ ఎనర్జీ ఈ చిత్రానికి పెట్టడం జరిగింది. అది కూడా చిత్రంలో తన పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉండటంతో ఆమె టైమింగ్ అలాగే తనదైన శైలి ఈ చిత్రానికి ప్లస్ అయ్యాయి. వీటివి గణేష్ పాత్ర అటు కామెడీగా అలాగే ఇటు కాస్త సమాజంలోని కొన్ని పాత్రలకు దగ్గరగా ఉంది. వెన్నెల కిషోర్ పోలీసు పాత్రలో తనదైన కామెడీతో ఎంటర్టైన్ చేశారు. సత్య పాత్ర తక్కువగా ఉన్నప్పటికీ తన ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో తాను తెరపైకి వచ్చిన ప్రతిసారి ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేస్తుంది. అనుదీప్ కామియో చాలా బాగుంది. పాటతోనే బ్రహ్మానందం పాత్ర పరిమితమైంది. అలాగే చిత్రంలోని ఇతర పాత్రలు తమ తమ పరిధిలో నటిస్తూ చిత్రానికి బోనస్ గా నిలిచాయి.

సాంకేతిక విశ్లేషణ :
కథ అంతంత మాత్రమే ఉన్నప్పటికీ మైండ్లెస్ కావడి అనే కాన్సెప్ట్ తో రావడంతో కథపై ప్రేక్షకులు అంతగా దృష్టి పెట్టే విధంగా ఉండదు. కేవలం ఎంటర్టైన్ అవ్వడానికి మాత్రమే తీసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో పూర్తిగా సఫలమైన అని చెప్పుకోవచ్చు. కొరియోగ్రఫీ చాలా బాగుంది అలాగే ఆ కొరియోగ్రాఫర్ కి తగ్గట్లు బ్యాక్గ్రౌండ్ ఇంకా కలర్ ప్యాలెట్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ పాటలు చాలా అద్భుతంగా వచ్చాయి. విజువల్స్, డిఐ వంటి ఇతర సాంకేతిక విషయాలు బాగున్నాయి. స్క్రీన్ ప్లే అంతగా పండలేదు.

చిత్ర విశ్లేషణ :
ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలతో ఈ సినిమాను పోల్చినప్పటికీ ఈ సినిమా శైలి కొత్తగా ఉంది. రెండు గంటల పాటు ప్రేక్షకులు కేవలం ఎంటర్టైన్ అయ్యే దిశగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. లాజిక్ తో పనిలేకుండా ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఎక్కడ అడల్ట్ కామెడీ లేకుండా ఎంతో జాగ్రత్తగా తీసిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా ఉంది.

ప్లస్ పాయింట్స్ :
నటీనటుల నటన, సాంకేతిక విషయాలు, పాటలు.

మైనస్ పాయింట్స్ :
కథ, స్క్రీన్ ప్లే.

సారాంశం :
కేవలం నవ్వుకుని లాజిక్స్ తో పని లేకుండా ఎంటర్టైన్ అయ్యే విధంగా కుటుంబంతో కలిసి చూడదగిన చిత్రం మిత్ర మండలి.

Related Articles

Latest Articles