
యువతను ఆకట్టుకునే ప్రేమకథ, మధురమైన సంగీతం, అద్భుతమైన లొకేషన్లతో తెరకెక్కిన ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’ చిత్రం థియేటర్లలో విజయం సాధించి, ఇప్పుడు సన్‌నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫీల్‌గుడ్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీని దర్శకుడు విపిన్ సరికొత్త శైలిలో తీర్చిదిద్దారు.
ధనవంతుడి కుమారుడు వరుణ్ (నరేష్ అగస్త్య) తన కళను నిరూపించుకోవాలని, తండ్రి ఇష్టాలకు వ్యతిరేకంగా ప్రయత్నిస్తాడు. మేఘన (రాబియా ఖతూన్)తో పరిచయం ప్రేమగా మారుతుంది. వారి బంధంలో వచ్చే మలుపులు, సంఘటనలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి.
అందమైన వల్పారై హిల్ స్టేషన్ లొకేషన్లు కనుల పండుగలా ఉంటాయి. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం, బీజీఎమ్ హృదయానికి హత్తుకుంటాయి. మోహనకృష్ణ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ చిత్రానికి బలం. నరేష్ అగస్త్య, రాబియా ఖతూన్ నటన సహజంగా ఆకట్టుకుంటుంది. రాధికా శరత్‌కుమార్, సుమన్, ఆమని వంటి సపోర్టింగ్ క్యాస్ట్ మరింత బలం చేకూరుస్తుంది.
నిర్మాత ఉమాదేవి కోట శ్రద్ధతో రిచ్ ప్రొడక్షన్ విలువలతో తయారు చేశారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ దసరా సెలవుల్లో పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్. ప్రేమికులు, సంగీత ప్రియులు తప్పకుండా చూడండి.


