జటాధారా నుండి ‘సోల్ ఆఫ్ జటాధారా’ విడుదల

జీ స్టూడియోస్ మరియు ప్రేరణా అరోరా నిర్మాణంలో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఎపిక్ స్పెక్టాకిల్ ‘జటాధారా’ టీజర్, పోస్టర్లు, నవంబర్ 7, 2025 రిలీజ్ డేట్ ప్రకటనతో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రేపింది. ఇప్పుడు మేకర్స్ మరో సర్‌ప్రైజ్‌గా మొదటి ట్రాక్ ‘సోల్ ఆఫ్ జటాధారా’ను విడుదల చేశారు.

ఈ పాట సినిమా టోన్‌కు సరిగ్గా సరిపోతూ, సాంప్రదాయ సంగీతం, దివ్య ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను జటాధారా ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. తీవ్రమైన బీట్స్, మొదట్లో ‘ఓం నమః శివాయ’ చాంటింగ్‌తో దివ్యత్వాన్ని రేకెత్తిస్తుంది. రాజీవ్ రాజ్ కంపోజ్ చేసి పాడిన ఈ ట్రాక్, ఆధ్యాత్మిక డెప్త్‌తో రా ఎనర్జీని తెస్తుంది.

ప్రమోషన్లు ఇక పూర్తి స్వింగ్‌లోకి వచ్చాయి. సినిమాలో దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్, ఇందిరా కృష్ణ, రవి ప్రకాశ్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, సుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. మంచి vs చెడు, కాంతి vs చీకటి, మానవ ఇచ్ఛ vs కాస్మిక్ ఫేట్ థీమ్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సాల్, శివిన్ నారంగ్, అరుణా అగర్వాల్, ప్రేరణా అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మిస్తున్నారు. కో-ప్రొడ్యూసర్లు అక్షయ్ కేజ్రివాల్, కుసుమ్ అరోరా; క్రియేటివ్ ప్రొడ్యూసర్ దివ్యా విజయ్; సూపర్‌వైజింగ్ ప్రొడ్యూసర్ భవిని గోస్వామి. జీ మ్యూజిక్ కో సౌండ్‌స్కేప్ హ్యాండిల్ చేస్తోంది. హిందీ, తెలుగు భాషల్లో నవంబర్ 7న విడుదల!

Related Articles

Latest Articles