ఈడి నుండి దగ్గుబాటి రానా కు ఎదురైన ప్రశ్నలు ఇవే…

బెట్టింగ్ యాప్స్ కేసులో కొంతమంది సెలబ్రిటీల పేర్లు వెలుగులోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అదే లిస్టులో ఉన్న దగ్గుబాటి రానా నేడు విచారణకు ఈడి ముందుకు వెళ్లడం జరిగింది. కాగా ఈడి దగ్గుబాటి రానా ను ఈ ప్రశ్నలు అడిగినట్లు సమాచారం :-

1. జంగిల్ రమ్మీ అనే యాప్ ను ఎన్నేళ్ళు పాటు కాంట్రాక్టు తీసుకున్నారు ?

2. దుబాయ్ బేస్డ్ గా నడుస్తున్న జంగిల్ రమ్మీ నుండి మీకు వచ్చిన నగదు ఎంత?

3. గేమింగ్ యాప్, బెట్టింగ్ యాప్ అనేది మీకు తెలిసే ప్రమోట్ చేశారా ?

4. ప్రమోట్ చేసినందుకు మీకు పారితోషకం ఇచ్చారా లేక.. కమీషన్ ఇచ్చారా ?

5. ఎన్నేళ్ళు పాటు మీకు జంగిల్ యాప్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు ?

6. మీతో పాటు ఇంకా ఎవరెవరు ఈ కాంట్రాక్టు లో ఉన్నారు , అందులో మీరు పొందుపరుచుకున్న అంశాలు ఏంటి ?

7. జంగిల్ రమ్మీ యాప్ తో కాంట్రాక్ట్ చేసుకొనే ముందు వాటికి అనుమతులు, GST , టాక్స్, రిజిస్ట్రేషన్లు ఉన్నాయా లేదా అనేది మీరు ఎంక్వైరీ చేశారా ?

8. జంగిల్ రమ్మీ యాప్ ను సోషియల్ మీడియా ఫ్లాట్ ఫారం తోపాటు ఇంకా ఎక్కడైనా ప్రచారం చేశారా ?

9. జంగిల్ రమ్మీ యాప్ తో మీకు ఎప్పుడు కాంట్రాక్ట్ ముగిసింది ?

10. వారి చెల్లించిన చెల్లింపులు మీకు ఏవిధంగా చేరాయి… డైరెక్ట్ అకౌంట్ లో జమ చేశారా ? బిట్ కాయిన్ రూపం లో చెల్లించారా ?

Related Articles

Latest Articles