
మెగా స్టార్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘విశ్వంభర’ నుండి మరో ప్రత్యేక అప్‌డేట్ విడుదలైంది. ఈసారి కథానాయిక ఆశికా రంగనాథ్ పుట్టినరోజు సందర్భంగా ఆమె లుక్‌ను విడుదల చేశారు.
యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మైథలాజికల్ ఫ్యాంటసీ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా చిరు మళ్ళీ పవర్‌ఫుల్ రోల్ లో కనిపించనుండటం విశేషం. త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఆశికా లుక్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె లుక్‌తోపాటు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.


