అలా చేయడం సరైనది కాదు : విరాట పాలెం పై నటి వర్ష బొల్లమ్మ

ఇటీవల జి ఫైవ్ ఓటిటి ప్లాట్ఫారం పై విరాట పాలెం అనే వెబ్ సిరీస్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ వెబ్ సిరీస్ పై ఇప్పటికే ఎన్నో చర్చలు జరిగాయి. అదే తరహాలో ఈటీవీ విన్ ప్లాట్ఫారం పై రానున్న కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ కంటెంట్ ను జి ఫైవ్ వారు విరాట పాలెం పేరిట ఒక వెబ్ సిరీస్ చేయడం జరిగింది. రెండింటి కదా ఒకటేనని, కానిస్టేబుల్ కనకం దర్శకుడు ఆ కథను ముందుగా జీ ఫైవ్ లో చెప్పగా వారు లేట్ చేయడంతో అదే కథను ఈటీవీ విన్ లో మొదలుపెట్టమని అన్నారు. అయితే ఆ కథను g5 వారు కాపీ కొట్టి సుమారుగా అటువంటి మరొక వెబ్ సిరీస్ ను విరాట పాలెం పేరిట విడుదల చేశారని ఆరోపించడం జరిగింది. ఈ విషయంపై ఇరు ఓటిటి ప్లాట్ఫామ్ సంస్థలు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ విషయం కోర్టులో ఉండగా ఇప్పటికే వారు మీడియాతో కూడా సమావేశమయ్యారు. తదుపరి విషయాలు కోర్టు ఆదేశాల మేరకు అక్కడ వచ్చిన తీర్పు మేరకు వారు మాట్లాడదామని చాలా పరిమితిగా మీడియా వారితో మాట్లాడారు.

ఇది ఇలా ఉండగా కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్లో లీడ్రోలుగా నటిస్తున్న వర్షా బొల్లమ్మ నటించిన తమ్ముడు చిత్రం విడుదలకు సిద్ధమైంది. తమ్ముడు చెత్త ప్రమోషన్ లో భాగంగా మీడియా వారితో సమావేశమైన వేల తన కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ ఇష్యూ గురించి మీడియా వారు ప్రశ్నించగా ఆమె అలా మరొక సంస్థలో వారి కథకు దగ్గరగా ఉండే మరొక వెబ్ సిరీస్ రావడం అనేది సరైనది కాదు అన్నట్లుగా అన్నారు. సిరీస్ చూడకపోయినా ట్రైలర్ సుమారుగా దగ్గరగానే ఉందని, రెండు వెబ్ సిరీస్ ల ప్రపంచాలు ఒకేలా ఉన్నాయని ఆమె తెలిపారు. ఏదేమైనప్పటికీ అలా ఒకే విధమైన వెబ్ సిరీస్ లు రావడం సరైనది కాదు అని అన్నారు.

Related Articles

Latest Articles