ఐఫాలో మెరుపులు… అలియా, రణ్వీర్ కి అవార్డులు

ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిలిం అకాడమీ అవార్డు (ఐఫా) ఫంక్షన్ ముంబైలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ ఏడాది ఉత్తమ నటిగా రాజీ సినిమాకి గాను అలియాభట్‌, ఉత్తమ నటుడిగా పద్మావత్ సినిమాకి రణవీర్‌ సింగ్‌ ఐఫా అవార్డ్ అందుకున్నారు. బెస్ట్ మూవీగా ‘రాజీ’, బెస్ట్ డైరెక్టర్ గా శ్రీరాం రాఘవన్‌(అంధాధూన్‌ ఫేమ్), బెస్ట్ డెబ్యూ యాక్టర్ ఇషాన్‌ ఖట్టర్‌, (ధడక్‌), బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా సారా అలీఖాన్‌ (కేదార్‌నాథ్‌), సహాయ నటుడిగా విక్కీ కౌశల్‌ (సంజూ), సహాయనటిగా అదితీరావు హైదరీ (పద్మావత్‌) ‘ఐఫా’ పురస్కారం అందుకున్నారు. బాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ ఐఫా వేదికపై మెరిశారు. ఈ సందర్భంగా కట్రీనా కైఫ్‌, రణ్‌వీర్‌ సింగ్‌, సారా అలీ ఖాన్ డాన్సులు వ్యూవర్స్ ని అలరించాయి. గత 20 ఏళ్లలో వచ్చిన బెస్ట్ మూవీగా ‘కహోనా ప్యార్‌ హై’కి స్పెషల్ ‘ఐఫా’ అవార్డు దక్కింది. లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డుని లెజెండరీ కమెడీయన్‌ జగదీప్‌ జాఫ్రీని వరించింది. దీపికా పదుకోన్‌, రణబీర్‌ కపూర్‌, రాజ్‌కుమార్‌ హిరానీ, ప్రీతంలు కూడా ప్రత్యేక అవార్డులు అందుకున్నారు.