20ఏళ్ళ క్రితం.. త్రిష జీవితాన్ని మార్చిన రోజు

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు వెళుతుంటారు. కానీ కొంతమంది మాత్రమే ప్రేక్షకుల మదిలో చిరకాలం ఒక చెరగని ముద్ర వేసుకుంటారు. అలాంటి వారిలో త్రిష ఒకరు. ఈ బ్యూటీ రీసెంట్ గా ఒక స్పెషల్ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. 16 ఏళ్ళ వయసులో 1999లో మిస్ చెన్నైగా కిరీటాన్ని అందుకున్న ఆ మూమెంట్ ని గుర్తు చేసుకున్న త్రిష తన కెరీర్ లో అదే చాలా ముఖ్యమైన రోజని తెలిపింది.

నా జీవితాన్ని మార్చిన రోజు సెప్టెంబర్ 30 అంటే చాలా ఇష్టమని త్రిష వివరణ ఇచ్చింది. ఇక మొదట త్రిష 1999 లో ప్రశాంత్ మరియు సిమ్రాన్ జంటగా నటించిన జోడి సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా వెండితెరపైకి ప్రవేశించింది. ఇక 2002 లో విడుదలైన సూర్య యొక్క మౌనం పెసియాధే ఆమెకు తమిళ్ లో హీరోయిన్ గుర్తింపు తెచ్చింది. 2004 లో తెలుగులో ప్రభాస్ వర్షం సినిమాలో ఛాన్స్ అందుకొని అగ్ర నటిగా వెలిగింది. దాదాపు తెలుగు తమిళ్ లో స్టార్ హిరోలందరితో వర్క్ చేసింది. ఆమె 2 దశాబ్దాల కెరీర్‌లో 37 ఏళ్ల త్రిష తన గ్లామర్ తో ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆకట్టుకుంటూనే ఉంది. ఇక నెక్స్ట్ త్రిష నుంచి వారుసగా ఆరు సినిమాలు రాబోతున్నాయి.