14 ఏళ్ల బన్ని స్నేహ పెళ్లి బంధం

నేడు 14వ పెళ్లి రోజు జరుపుకుంటున్న బ్యూటిఫుల్‌ కపుల్‌ ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ అండ్‌ స్నేహా రెడ్డి దంపతులు కొన్ని బంధాలు కలవాలని… దేవుడు రాసిపెడతాడు.. ఇక అప్పుడు ఆరు నూరైన ఆ బంధం ఒక్కటవుతుంది. ఆయన ఆశ్శీస్సులతో వాళ్ల ప్రయాణం ఎంతో సజావుగా..నలుగురికి ఆదర్శంగా కొనసాగుతుంది. ఇతరులు అసూయ పడే అప్యాయతల నడుమ, అన్యోన్యంగా వారి జర్ని కొనసాగుతుంది. సరిగ్గా అలాంటి ‘అల్లు’కున్న ‘స్నేహా’ బంధం… ప్రేమబంధం ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, స్నేహారెడ్డిల భార్యాభర్తల అనుబందం. 14 ఏళ్ల క్రితం ప్రేమించి వివాహాం చేసుకున్న ఈ జంట నేడు 14వ పెళ్లి రోజు జరుపుకుంటున్నారు.

ఈ రోజు అల్లు అర్జున్‌ ఐకాన్‌స్టార్‌గా, ప్రపంచ ప్రఖ్యాతి పొందటంలో, ఇండియా సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన హీరోగా ఉన్నారంటే తప్పకుండా ఆయన వెనుక స్నేహా రెడ్డి గారి సపోర్ట్‌, ప్రోత్సాహం ఎంతో ఉందని చెప్పొచ్చు. ప్రతి విషయంలో ఈ జంట ఎంతో అండర్‌స్టాండింగ్‌తో ముందుకెళుతుంటారని, ఫ్యామిలీకి టైమ్‌ను కేటాయించడంలో, పిల్లల ఆలనా పాలనాలో ఇద్దరిది ఒకే బాట.. సినిమాతో పాటు వ్యక్తిగత జీవితానికి సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారంటే ఈ ఇద్దరి సమన్వయం ఆదర్శప్రాయంగా ఉంటుందని అంటుంటారు సినీ జనాలు. ఈ రోజు ఈ బ్యూటిఫుల్‌ కపుల్‌ 14 వసంతాల పెళ్లి రోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అందరూ ఈ జంట కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు అందజేస్తున్నారు.