
సత్య ఆర్ట్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సత్య కోమల్ నిర్మాతగా శ్రీహర్ష మన్నే రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో. అంకిత్ కొయ్య, శ్రీయ కొంతం జంటగా వెన్నెల కిషోర్, ఇంద్రజ, ప్రశాంత్ శర్మ తదితరులు కీలకపాత్రను పోషిస్తూ ఈనెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రావడం జరిగింది. మార్క్ కే రాబిన్ సంగీత దర్శకుడిగా కే సోమశేఖర్ సినిమాటోగ్రఫీ వహిస్తూ ప్రదీప్ ఎడిటర్గా పని చేశారు. ఇక ఈ చిత్ర విశేషాలు వస్తే…
కథ:
దర్శకుడు అవ్వాలనుకునే అంకిత్ కొయ్య కు శ్రియ ఆన్లైన్ ద్వారా పరిచయమవుతుంది. అయితే వారిద్దరూ ఫ్రీ ఆ ఇంట్లో ఎవరూ లేని సమయంలో కలవాలి అనుకుంటారు. అలా వచ్చిన అంకిత్ 14 రోజులపాటు అదే ఇంట్లో లాక్ అయిపోవడం జరుగుతుంది. అయితే ఇదంతా కరోనా సమయంలో జరగడంతో ఆ సమయంలో అంకిత్ శ్రీయ ఇంట్లో 14 రోజుల పాటు వారి ఇంట్లో వారికి తెలియకుండా ఎలా ఉంటాడు? ఆ సమయంలో వారికి వచ్చిన కష్టాలు ఏంటి? చివరివరకు అంకిత్ దొరకకుండా ఉంటాడా లేదా దొరికిపోతాడా? ఇన్ని సమస్యల మధ్యలో శ్రియకు వచ్చిన మరో సమస్య ఏంటి? ఇంతకు చివరికి వారి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా లేదా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రం చూడాల్సిందే.
నటీనటుల నటన:
అంకిత్ కొయ్య నటన విషయానికి వస్తే ఇప్పటికే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం, ఆయ్ వంటి చిత్రాలలో మనం చూసాము. అదేవిధంగా ఈ చిత్రంలో కూడా తన అమాయకత్వంతో అలాగే కామెడి టైమింగ్ తో ఎంతో చక్కగా నటించారు. నాని గ్యాంగ్ లీడర్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సుపరిచితురాలు అయిన శ్రేయ కొంతం ఈ చిత్రంలో హీరోయిన్గా నటించడం జరిగింది. యంగ్ అండ్ కొంచెం మెచ్యూర్డ్ బిహేవియర్ తో ఎక్కువ గ్లామర్ షో లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా నటించారు. చిత్రంలో ముఖ్యంగా వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ చాలా బాగుంది. తన కామెడీ ఇంకా ఎక్స్ప్రెషన్స్ తో ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న వెన్నెల కిషోర్ ఈ చిత్రానికి గొప్ప బోనస్గా నిలిచారు. ఇంద్రజ ఇంకా తదితర నటీనటులు తమ తమ పరిధిలో నటిస్తూ చిత్రాన్ని సక్సెస్ చేశారు.
సాంకేతిక విశ్లేషణ:
ఈ చిత్రాన్ని కరోనా సమయంలో జరిగినట్లు హర్షా మన్నే అప్పటి సిచువేషన్స్ కు అనుకూలంగా చక్కటి కథ రాసుకుని ఆ కథను పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తూ దర్శకత్వం వహించారు. అదేవిధంగా నటీనటుల దగ్గర నుండి సాంకేతిక బృందం వరకు దర్శకుడు అందరిని పూర్తిగా వాడుకున్నారు. చిత్రంలోని మంచి క్వాలిటీని బట్టి నిర్మాణ విలువలు అర్థమవుతున్నాయి. సీనులకు తగ్గట్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సిచువేషన్ కు తగ్గట్లు పాటలతో సంగీతం బావుంది. లొకేషన్ లో తక్కువైనప్పటికీ ఆ తక్కువ లొకేషన్స్ లోనే ఎంతో డెప్త్ ఉండేది విధంగా దర్శకుడు జాగ్రత్త పడ్డారు. కలరింగ్ ఇంకా ఇతర సాంకేతిక విశేషాలను ఎక్కడ కొదువ లేకుండా చూసుకున్నారు.
ప్లస్ పాయింట్స్:
కథ, కామెడీ, నటీనటుల నటన
మైనస్ పాయింట్స్:
సినిమా బాగున్నప్పటికీ ఎక్కువ లెంగ్త్ లేకపోవడం
సారాంశం :
బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ గా మంచి కామెడీ ఇంకా కథతో పూర్తిగా వినోదపరిచే చిత్రం 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో.