Rana: టాలీవుడ్‌లో 11ఏళ్లు పూర్తి చేసుకున్న‌ భ‌ళ్లాల‌దేవ..

Rana: ద‌గ్గుబాటి రానా.. శేఖ‌ర్‌క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన లీడ‌ర్ చిత్రం ద్వారా టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. తొలి చిత్రంతోనే పొలిటిక‌ల్ నేప‌థ్యం క‌థాంశంతో తెర ముందుకు వ‌చ్చిన Ranaరానా.. త‌న న‌ట‌న‌తో పాటు హావాభావాలు ప్రేక్ష‌కులు ఎంతో ఫిదా అయ్యారు. ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 19న 2010లో విడుద‌లైంది.. దీంతో శ‌నివారంతో ఈ సినిమా విడుద‌లై 11సంవ‌త్స‌రాలు పూర్తయ్యాయి. ఈ చిత్రంలో రానా యంగ్ సీఎంగా అద‌ర‌గొట్టాడు. ఈ చిత్రం త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించి విల‌క్ష‌ణ న‌టుడిగా ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడుRana.

rana11years

ఇక రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి చిత్రంలో రానా భ‌ళ్లాల‌దేవ‌గా ప్రేక్ష‌కుల్లో గుర్తుండిపోయాడు. దీంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు రానా. రానా గ‌తేడాది క‌రోనా స‌మ‌యంలో మిహిక‌ను పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. కాగా టాలీవుడ్ ఇండ‌స్ట్రీ లో ఎంట్రీ ఇచ్చి నేటితో 11ఏళ్లు పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా త‌న భార్య మిహిక ఇన్‌స్టాగ్రామ్‌లో విషెస్ తెలిపింది.హ్యాపీ 11ఇయ‌ర్స్‌.. మై డార్లింగ్ రానా అంటూ క్యాప్ష‌న్ పెట్టింది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. దీంతో రానాకు ఫ్యాన్స్ విషెస్ తెలుపుతున్నారు. ఇక రానా ప్ర‌స్తుతం ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్‌తో మ‌ల‌యాళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్ చిత్రంలో న‌టిస్తున్నాడుRana:.