కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ప్రత్యేక వివాహ ఫుటేజీ కోసం 100 కోట్లు ఆఫర్

కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్ డిసెంబర్ 9 వివాహం చేసుకోబోతున్నారు. ఈరోజు ‘సంగీత’ వేడుకతో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. రేపు ‘మెహందీ’ వేడుకను నిర్వహించి ప్రత్యేక రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ జంట తమ పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలను సీక్రెట్ గా అత్యంత ప్రైవేట్ గా చేసుకోవాలనుకుంటున్నారు అయితే కత్రినా మరియు విక్కీ వివాహ ఫుటేజీకి ఎక్సక్లూసివ్ రైట్స్ కోసం ఒక OTT ప్లాట్‌ఫారమ్ ఏకంగా రూ. 100 కోట్లు ఆఫర్ చేశారు అని సమాచారం.

“సెలబ్రిటీలు తమ వివాహ ఫుటేజీలు మరియు చిత్రాలను మ్యాగజైన్‌లకు మరియు కొన్ని సమయాల్లో ఛానెల్‌లకు కూడా అమ్మడం పశ్చిమ దేశాలలో ఒక సాధారణ ట్రెండ్, ఎందుకంటే వారి జీవితాన్ని మార్చే సంఘటనలో జరిగిన ప్రతిదాన్ని చూడటానికి చాలా మంది అభిమానులు కోరుకుంటారు . ఒక ఓటిటి స్ట్రీమింగ్ దిగ్గజం భారతదేశంలో కూడా అదే ట్రెండ్‌ని తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది మరియు వారు కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్‌లకు రూ. 100 కోట్లు ఆఫర్ చేశారు.”

ఈ వివాహానికి మొత్తం 120 మంది బాలీవుడ్ మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.