రానాకు భార్య లెహెంగా కోసం 10వేల గంటలు కష్టపడ్డారట!

దగ్గుబాటి నట వారసుడు, బాహుబలి సినిమాతో భారీ క్రేజ్ తెచ్చుకున్న టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ రానా దగ్గుబాటి ఇవాళ(08 ఆగస్ట్ 2020) పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. తన ప్రేయసి మిహికా బజాజ్‌ మెడలో మూడు ముళ్లు వేసి సంసార సాగరంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఈ క్రమంలో పెళ్లికి ముందు నిర్వహించే సంప్రదాయ వేడుకలైన హల్దీ, మెహందీలకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక్కడ ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే? రానా దగ్గుబాటి ప్రియురాలు మిహికా గోల్డెన్-మెరూన్ మరియు బూడిద రంగు లెహంగా వేసుకుని ఉండగా.. అందులో చాలా అందంగా కనిపించింది. డిజైనర్ అనామిక ఖన్నా ఈ పెళ్లి లెహంగా గురించి ప్రత్యేకమైన ఆసక్తికర వివరాలను వెల్లడించింది.

మిహికా అభిరుచిని దృష్టిలో పెట్టుకుని హుందాతనం ఉట్టిపడే విధంగా లెహంగాను రూపొందించినట్లు వెల్లడించారు అనామిక. క్రీమ్, గోల్డ్ రంగుల కలయికలో ఉండే లెహంగాకు, చిక్కన్ కరీ, గోల్డ్ మెటల్ వర్క్, జర్దోసి వర్క్ చేసినట్లు చెప్పారు. చేనేత బంగారు వర్ణ దుప్పట్టా పెళ్లి సమయంలో ఆమె ధరించబోతుంది. మిహికా ధరించబోయే ఈ పెళ్లి లెహంగాను తయారు చేసేందుకు సుమారు పదివేల గంటలు సమయం పట్టిందని డిజైనర్ వెల్లడించారు. మిహిక తల్లి బంటీ బజాజ్ అభిరూచి ప్రకారం వీటిని రూపొందించినట్లు చెప్పారు.

మిహికా బజాజ్ సింపుల్‌గా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు అనామిక చెప్పుకొచ్చారు. ఆమె మేకప్ ఆర్టిస్ట్ తమన్నా రూజ్ సైతం మిహీకా చాలా సింపుల్ మేకప్ వేసుకోనున్నట్లు స్పష్టం చేశారు. వీలైనంత సహజంగా ఉండేలా మేకప్ వేసుకుంటుందని వెల్లడించారు.