మామ నాగార్జున కోసం సమంత బర్త్ డే ప్లాన్

స్టార్ హీరోల పుట్టినరోజు వస్తే చాలు సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక భారీ రికార్డులు నమోదవుతున్నాయి. బర్త్ డే కామన్ డీపీలను ట్రెండ్ సెట్ చేస్తూ అభిమానులు వారి బలాన్ని ప్రేమను నీరూపించుకుంటున్నారు. ఇటీవల సమంత అక్కినేని కూడా తన మామ నాగార్జున బర్త్ డేను కూడా అదే రేంజ్ లో సెలబ్రేట్ చేసుకునేలా ప్లాన్ వేసింది. ఈ నెల 29న నాగార్జున 61వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు.

ఈ సందర్భంగా సమంత అక్కినేని ప్రత్యేకంగా బర్త్ డే కామన్ డీపీని విడుదల చేశారు. ‘కింగ్ నాగార్జున బర్త్ డే డీపీ రిలీజ్ చేయడం నాకు ఎంతో గౌరవంగా ఉంది. ఆయనపై ప్రేమ, గౌరవం ఎల్లప్పుడూ ఉంటుంది. అందరి గుండెల్లో ఆయన ఎప్పుడైనా రాజే” అంటూ సమంత సోషల్ మిసియాలో పేర్కొంది. ఇక నాగార్జున పుట్టినరోజుకు ఇంకో వారం సమయం ఉన్నా కూడా అభిమానులు ఆయనకు అడ్వాన్స్ విషెస్ అందిస్తూ సోషల్ మీడియాలో కింగ్ పేరు ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. ఇక నెక్స్ట్ నాగార్జున వైల్డ్ డాగ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.