మహేష్‌కు వదినగా పవన్ మాజీ భార్య

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్యగా హీరోయిన్ రేణూదేశాయ్ అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు పాపులర్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రేణూదేశాయ్.. ఆ తర్వాత నిర్మాతగా కూడా మారి సినిమాలు నిర్మించింది. కానీ అవి ఏవీ సక్సెస్ కాలేదు. ప్రస్తుతం హీరోయిన్‌గా అవకాశాలు రాకపోవడంతో.. బుల్లితెరపై అడుగుపెట్టి పలు షోలకు హోస్టింగ్ చేసింది. ఇప్పుడు సైడ్ పాత్రలలో కూడా నటించేందుకు రేణూదేశాయ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

renu-desai--mahesh-movie
renu-desai–mahesh-movie

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా పరశురామ్ డైరెక్షన్‌లో ‘సర్కారువారి పాట’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. ఇందులో మహేష్‌కు వదినగా రేణూదేశాయ్ నటించనుందట. ఇప్పటికే సినిమా యూనిట్ రేణూదేశాయ్‌ను సంప్రదించగా.. మహేష్‌కు వదినగా నటించేందుకు ఆమె కూడా ఒకే చెప్పేసిందట.

మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించనున్నాడు. బ్యాంకు స్కాంల ఆధారంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. బ్యాంకుల దగ్గర వేల కొట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారి గురించి ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తోంది.