బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ చాలా రోజుల తరువాత మళ్ళీ షూటింగ్స్ తో బిజీ అయ్యారు. ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన కౌన్ బనేగా క్రోర్‌పతి 12వ సీజన్ ని మళ్ళీ స్టార్ట్ చేశారు అమితాబ్ బచ్చన్. కొన్ని వారాల క్రితం ఇదే షో కోసం ఒక స్టూడియోకి వెళ్లిన అమితాబ్ బచ్చన్ ఆడిషన్స్ లో పాల్గొనడంతో కరోనా సోకినట్లు టాక్ వచ్చింది.
దాదాపు రెండు వారాలకు పైగా కరోనాతో పోరాడిన అమితాబ్ పెద్దగా ఇబ్బంది పడకుండా కొలుకున్నారు. ముంబైలోని నానా వతి హాస్పిటల్ లో అమితాబ్ చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. అమితాబ్ తో పాటు కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్యారాయ్, మనవరాలు ఆరాధ్య కూడా కరోనా భారీన పడిన విషయం తెలిసిందే. ఇక అందరూ కోలుకున్నాక మరోసారి అబితాబ్ బచ్చన్ షూటింగ్స్ కి వెళుతున్నారు. కౌన్ బనేగా క్రోర్‌పతి 12వ సీజన్ ఇటీవల మళ్ళీ మొదలైంది అంటూ ఆయన ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. ఇక షో నిర్వాహకులు బచ్చన్ ఆరోగ్య పరిస్థితిని గమనించి ఈ సారి వీలైనంత వరకు స్పెషల్ గా రక్షణ కల్పించాలని ప్లాన్ వేసినట్లు సమాచారం.